Ruturaj Gaikwad: ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చిన గైక్వాడ్.. హాఫ్ సెంచరీ చేసినా అవమానకరమైన రికార్డు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ruturaj Gaikwad: ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. వరుస వైఫల్యాల తర్వాత తొలి అర్ధశతకం నమోదు చేసిన గైక్వాడ్, జట్టుకు కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఈ ఇన్నింగ్స్‌తో పాటు అతని ఖాతాలో ఓ అవమానకరమైన రికార్డు కూడా చేరింది. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో గైక్వాడ్ చాలా నెమ్మదిగా బ్యాటింగ్ ప్రారంభించాడు. తొలి నుంచి పరుగులు రావడంలో ఇబ్బంది పడిన అతడు అర్ధశతకం చేరేందుకు 49 బంతులు తీసుకున్నాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యంత నెమ్మదైన అర్ధశతకాలు చేసిన బ్యాటర్ల జాబితాలో చోటు సంపాదించాడు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
తరువాత మాత్రం గైక్వాడ్ తన శైలిని మార్చి వేగంగా ఆడాడు. 50 పరుగులు పూర్తయ్యాక గేర్ మార్చిన అతడు బౌండరీలు, సిక్సర్లతో రాణించాడు. చివరకు 60 బంతుల్లో 74 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. అయితే, ఐపీఎల్ చరిత్రలో అత్యంత నెమ్మదైన అర్ధశతకం రికార్డు జేపీ డుమిని పేరిట ఉంది. అతడు 55 బంతుల్లో ఈ ఫీట్ సాధించాడు. ఆ తర్వాత పార్థివ్ పటేల్ 53 బంతుల్లో, డుమిని మరోసారి 52 బంతుల్లో, డేవిడ్ వార్నర్, గౌతమ్ గంభీర్ చెరో 50 బంతుల్లో అర్ధశతకాలు సాధించారు. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ సరసన 49 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన ఆటగాడిగా గైక్వాడ్ నిలిచాడు.
చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఇది ఆరో అత్యంత నెమ్మదైన అర్ధశతకం కూడా కావడం విశేషం. గతంలో పార్థివ్ పటేల్, మాథ్యూ హేడెన్, మురళీ విజయ్, డ్వేన్ స్మిత్ ఈ జాబితాలో ఉన్నారు. ఇప్పుడు రుతురాజ్ గైక్వాడ్ కూడా ఆ క్లబ్లో చేరాడు. ఇక, మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్కేకు దారుణ ఆరంభం లభించింది. పవర్‌ప్లేలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. సంజూ శాంసన్ 11 పరుగులు, ఉర్విల్ పటేల్ 4 పరుగులు, సర్ఫరాజ్ ఖాన్ 10 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ఆరు ఓవర్ల ముగిసే సరికి సీఎస్కే స్కోరు 28/3గా నిలిచింది. మధ్య ఓవర్లలో కూడా సీఎస్కే ఇబ్బందులు ఎదుర్కొంది. 10 ఓవర్ల తర్వాత స్కోరు 43/4కి చేరింది. ఈ దశలో గైక్వాడ్, శివమ్ దూబే కలిసి ఐదో వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును ఆదుకున్నారు. దూబే 22 పరుగులు చేశాడు. చివరి ఓవర్లలో కార్తిక్ శర్మ 9 బంతుల్లో 15 పరుగులు, జేమీ ఓవర్టన్ 6 బంతుల్లో 18 పరుగులు చేసి వేగం పెంచారు. దీంతో సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 158/7 స్కోరు చేసింది. అయితే ఈ లక్ష్యాన్ని గుజరాత్ జట్టు సులభంగా ఛేదించి విజయాన్ని అందుకుంది. గైక్వాడ్ హాఫ్ సెంచరీ చేసినా, జట్టుకు విజయం అందించలేకపోయాడు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!