MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ సాయి పల్లవి ప్రధాన పాత్రలో లెజెండరీ సింగర్ ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అయితే సాయి పల్లవి వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా నుండి తప్పుకుందని ఆ అవకాశం కోలీవుడ్ బ్యూటీ రుక్మిణి వసంత్‌కు దక్కిందని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే అవేవి వాస్తవం కాదని మేకర్స్ తెలిపారు.
నిర్మాత బన్నీవాసు ద్వారా అందిన సమాచారం ప్రకారం ఎం.ఎస్. సుబ్బలక్ష్మి పాత్రకు సాయి పల్లవి తప్ప మరో ఆలోచన లేదు. ఆమెను మార్చామనే వార్తలన్నీ కేవలం ఫేక్ న్యూస్ మాత్రమే. ఈ పాత్రకు ఆమె వంద శాతం న్యాయం చేయగలదని టీమ్ బలంగా నమ్ముతోంది. రుక్మిణి వసంత్‌ను తీసుకున్నామనే దాంట్లో అస్సలు నిజం లేదు’ అని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న ఈ చిత్రం అక్టోబర్ 2026 నుండి సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని బన్నీ వాస్ వెల్లడించారు. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్న ఈ క్లాసికల్ బయోపిక్కు రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించబోతున్నారు. ఈ పాత్ర కోసం సాయి పల్లవి ఇప్పటికే కర్ణాటక సంగీతంలో శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం. రామాయణ, కల్కి 2, మణిరత్నం ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండటంతో షూటింగ్ అక్టోబర్ కి వాయిదా పడింది. గౌతమ్ తిన్ననూరి మార్క్ ఎమోషన్స్, అనిరుధ్ సంగీతం మరియు సాయి పల్లవి అద్భుత నటన తోడైతే ఈ సినిమా భారతీయ సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
Also Read
- Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్‌ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
- IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్‌లో రెండు మార్పులు..
- OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
- OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
తాజావార్తలు
-
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్‌ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్‌లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!