Site icon NTV Telugu

IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్‌కు కొత్త కెప్టెన్..? అక్షర్ ను తప్పించనున్న మేనేజ్మెంట్..!

Ipl 2026

Ipl 2026

IPL 2026: ఐపీఎల్‌ 2026 సీజన్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ (DC) శిబిరంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నట్లు గుసగుసలు వినపడుతున్నాయి. అందిన సమాచారం ప్రకారం.. గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు నాయకత్వం వహించిన అక్షర్ పటేల్‌ను వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. ఇకపై అక్షర్ కేవలం ఆటగాడిగా మాత్రమే జట్టులో కొనసాగబోతున్నట్లు సమాచారం.

H-1B, H-4 వీసా దరఖాస్తుదారులకు అమెరికా గ్లోబల్ అలర్ట్.. మరింత కఠినంగా మారనున్న ఆన్‌లైన్ ప్రెజెన్స్ స్క్రీనింగ్

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో అక్షర్ పటేల్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను 14 మ్యాచ్‌లలో 7 విజయాలను అందించాడు. లీగ్ దశలో ఐదో స్థానంలో నిలవడంతో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోవడం మేనేజ్మెంట్‌ను కొత్త ఆలోచన వైపు నడిపించినట్లు తెలుస్తోంది. అక్షర్ జట్టులో అత్యంత నమ్మకమైన ఆల్‌రౌండర్‌గా కొనసాగుతాడని, అయితే నాయకత్వ బాధ్యతలు మాత్రం మరో ఆటగాడికి అప్పగించాలని ఫ్రాంచైజీ భావిస్తున్నట్లు సమాచారం.

కొత్త కెప్టెన్‌గా కేఎల్ రాహుల్?
రిపోర్టుల ప్రకారం అనుభవజ్ఞుడైన వికెట్‌ కీపర్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్‌గా మొదటి ఆప్షన్ గా ఉన్నాడు. ఇదివరకు పంజాబ్ కింగ్స్‌, లక్నో సూపర్ జెయింట్స్ జట్లకు కెప్టెన్సీ చేసిన అనుభవం రాహుల్‌కు ఉంది. ప్రస్తుతం కూడా జట్టులో సీనియర్ ప్లేయర్‌గా కీలక పాత్ర పోషిస్తున్న రాహుల్‌ను లీడర్‌షిప్ గ్రూప్‌ హెడ్‌గా పెట్టి జట్టుకు కొత్త ఉత్సాహం ఇవ్వాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

New Income Tax Rules: ఇకపై డిజిటల్ ఖాతాలను వదలబోనంటున్న ఐటీ శాఖ.. అతి త్వరలో సరికొత్త రూల్స్ అమల్లోకి..!

టీమిండియాలో అక్షర్‌కు ప్రమోషన్:
ఐపీఎల్‌లో కెప్టెన్సీ బాధ్యతలు లేకపోయినా.. మరోవైపు టీమిండియాలో అక్షర్ పటేల్‌కు తాజాగా ప్రమోషన్ లభించింది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌ 2026 కోసం బీసీసీఐ అక్షర్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించింది. శుభ్‌మన్ గిల్ స్థానంలో ఈ బాధ్యతలు అక్షర్‌కు అప్పగించారు. గతంలోనూ అక్షర్ ఈ పాత్రలో జట్టుకు సేవలందించిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌ 2026కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌లో చోటుచేసుకుంటున్న ఈ మార్పులు జట్టు భవిష్యత్తుపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది. అక్షర్ పటేల్ ఆటతీరుతో కీలకంగా కొనసాగుతుండగా, కేఎల్ రాహుల్ కెప్టెన్సీ బాధ్యతలు చేపడితే జట్టు కొత్త దిశలో అడుగులు వేయనుంది.

Exit mobile version