మరో 10 రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ఆరంభం కానుంది. సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్స్ మార్చి 22న ఈడెన్ గార్డెన్స్ వేదికగా తలపడనున్నాయి. ఇప్పటికే అన్ని టీమ్స్ ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్నాయి. మరో 2-3 రోజుల్లో ప్లేయర్స్ అందరూ ప్రాక్టీస్ మొదలెట్టనున్నారు. అయితే ఐపీఎల్ 2025కి సమయం దగ్గరపడుతున్నా.. ఇప్పటివరకు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాంచైజీ తమ కెప్టెన్ ఎవరని ప్రకటించలేదు. కెప్టెన్సీ…