DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
ఐపీఎల్ చరిత్రలో ఏ జట్టుకైనా ఎదురుకాకూడని ఒకే ఒక్క రికార్డు ’49 పరుగులు’. 2017లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)పై ఆర్‌సీబీ చేసిన ఈ అతి తక్కువ స్కోరు ఒక పీడకలలా ఆ జట్టును వెంటాడుతూనే ఉంది. అయితే.. నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ చెత్త రికార్డు ఆర్‌సీబీ నుంచి వేరే జట్టుకు బదిలీ అవుతుందని అందరూ ఊహించారు.
“హమ్మయ్య.. 49 దాటేశాం!”
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆర్‌సీబీ బౌలర్లు నిప్పులు చెరిగారు. పవర్ ప్లే ముగిసేలోపే 6 వికెట్లు పడగొట్టి ఢిల్లీని కోలుకోలేని దెబ్బ కొట్టారు. ఒక దశలో ఢిల్లీ స్కోరు చూసి, కచ్చితంగా ఆ జట్టు 49 పరుగుల లోపే ఆలౌట్ అవుతుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఆర్‌సీబీ ఫ్యాన్స్ కూడా “మాపై ఉన్న చెత్త రికార్డు ఇవాళ్టితో తుడిచిపెట్టుకుపోతుంది” అని ఆశగా ఎదురుచూశారు. కానీ, డేవిడ్ మిల్లర్ మరియు అభిషేక్ పోరెల్ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. జట్టు స్కోరును 50 దాటించడంతో ఢిల్లీ అభిమానులు సోషల్ మీడియాలో “హమ్మయ్య.. 49 దాటేశాం” అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు.
Also Read
- RCB vs DC: ఒక్క మ్యాచ్ కే ఇంత తేడానా.? అప్పుడేమో 264.. ఇప్పుడు 75కే ఖేల్ ఖతం..!
- DC Vs RCB: రెండు చెత్త రికార్డులను మూట కట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ సంచలనం..
- RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
- మరోసారి వక్రబుద్ధి బయట పెట్టిన పాకిస్తాన్.. Vaibhav Sooryavanshi బ్యాట్‌లో AI చిప్ అంటూ కారుకూతలు.!
మిల్లర్, పోరెల్ పోరాటం
టాప్ ఆర్డర్ అంతా ఒక్క అంకెకే పరిమితమైన వేళ.. అభిషేక్ పోరెల్ (21 బంతుల్లో 19), డేవిడ్ మిల్లర్ (18 బంతుల్లో 19) జాగ్రత్తగా ఆడి స్కోరు బోర్డును ముందుకు నడిపారు. వీరిద్దరి వల్ల ఢిల్లీ జట్టు ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప స్కోరు చేసే ప్రమాదం నుంచి బయటపడింది. ప్రస్తుతం 11 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ 7 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది.
ఫ్యాన్స్ మధ్య ఆసక్తికర చర్చ..
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్. “రికార్డు బదిలీ అయ్యే ఛాన్స్ మిస్ అయింది” అని కొందరు ఆర్‌సీబీ ఫ్యాన్స్ సరదాగా కామెంట్స్ పెడుతుంటే.. “వికెట్లు పడినా పర్లేదు గానీ ఆ 49 రికార్డు మాత్రం మాకొద్దు” అని ఢిల్లీ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. మొత్తానికి ఢిల్లీ జట్టు ఆలౌట్ ప్రమాదం నుంచి బయటపడకపోయినా, అత్యల్ప స్కోరు అనే అవమానం నుంచి మాత్రం ప్రస్తుతానికి తప్పించుకుంది.
ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి ఢిల్లీ బెంబేలెత్తిపోయినా, మిడిల్ ఆర్డర్ పోరాటంతో పరువు దక్కించుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే.. బౌలింగ్‌లో ఆర్‌సీబీ చూపించిన ఆధిపత్యం చూస్తుంటే, ఈ మ్యాచ్‌లో విజయం వారిని వరించడం ఖాయంగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్‌ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
-
SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
-
AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
-
India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
-
Chairmans Desk : ఇరాన్ యుద్ధంతో ప్రపంచం పదేళ్లు వెనక్కిపోయిందా..?
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!