India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్‌ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Defense Budget: ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు, సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో అన్ని దేశాలు తమ సైనిక శక్తిని పెంచుకోవడంలో నిమగ్నమయ్యాయి. తాజాగా స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2025లో ప్రపంచ దేశాల మొత్తం సైనిక వ్యయం 2,887 బిలియన్ డాలర్లకు చేరుకుంది. వరుసగా 11వ ఏడాది కూడా ఈ ఖర్చు పెరగడం గమనార్హం. భారతదేశం 2025లో తన రక్షణ బడ్జెట్‌ను 8.9 శాతం పెంచి, మొత్తంగా 92.1 బిలియన్ డాలర్లకు చేర్చింది. దీంతో ప్రపంచంలోనే రక్షణ రంగంపై అత్యధికంగా ఖర్చు చేస్తున్న మొదటి ఐదు దేశాల్లో భారత్ నిలిచింది.
టాప్-5 దేశాలు ఇవే
అమెరికా, చైనా, రష్యా, జర్మనీ, భారత్. ఈ ఐదు దేశాలే ప్రపంచ మొత్తం రక్షణ వ్యయంలో 58 శాతం వాటాను కలిగి ఉన్నాయి.
Also Read
- IMD Weather Update : ఒకచోట వరదలు.. మరోచోట వాన జాడే లేదు.!
- Attack On Pappu Yadav: ఎంపీ పప్పు యాదవ్‌పై కత్తితో దాడి.. హడలెత్తించిన దుండగులు..
- West Bengal: జంతర్ మంతర్ వద్ద ఘర్షణలకు పాకిస్థాన్ టెర్రరిస్ట్ ప్లాన్.. పోలీసు యూనిఫామ్లతో విధ్వంసానికి స్కెచ్..
- Uttar Pradesh: పదేళ్ల ప్రేమకథ.. హిందూ ప్రేమికుడిని పెళ్లి చేసుకున్న ముస్లిం యువతి..
భారత్ – పాక్ ఉద్రిక్తతల ప్రభావం..
మే 2025లో భారత్ – పాకిస్థాన్ మధ్య తలెత్తిన సైనిక ఉద్రిక్తతలు, డ్రోన్లు, క్షిపణి దాడుల వంటి పరిణామాలు భారత్ తన రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కారణమయ్యాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పాకిస్థాన్ కూడా తన రక్షణ బడ్జెట్‌ను 11 శాతం పెంచి 11.9 బిలియన్ డాలర్లకు చేర్చింది. చైనా నుంచి కొత్త ఆయుధాల కొనుగోలు పాక్ వ్యయం పెరగడానికి ప్రధాన కారణంగా నిలిచింది. ఉక్రెయిన్‌కు అందాల్సిన కొత్త సాయం మంజూరు కాకపోవడంతో అమెరికా రక్షణ ఖర్చు 7.5 శాతం తగ్గి 954 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఇదే సమయంలో డ్రాగన్ కంట్రీ తన సైనిక వ్యయాన్ని 7.4 శాతం పెంచి 336 బిలియన్ డాలర్లకు చేర్చింది. చైనా రక్షణ బడ్జెట్ పెరగడం ఇది వరుసగా 31వ ఏడాది కావడం విశేషం.
ప్రపంచవ్యాప్తంగా రక్షణ సెగ
ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ తమ జీడీపీలో సగటున 2.5 శాతం రక్షణ రంగంపైనే ఖర్చు చేస్తున్నాయి. 2009 తర్వాత ఈ స్థాయిలో ఖర్చు పెరగడం ఇదే మొదటిసారి. ముఖ్యంగా ఉక్రెయిన్ యుద్ధం, నాటో దేశాల సన్నద్ధత కారణంగా ఐరోపాలో రక్షణ వ్యయం 14 శాతం పెరిగింది. ఆసియా – ఓషియానియా ప్రాంతాల్లో 8.1 శాతం వృద్ధి నమోదైంది. మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అస్థిరత, యుద్ధ భయాలు దేశాలను ఆయుధాల వేటలో పడేలా చేస్తున్నాయని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.
తాజావార్తలు
-
IMD Weather Update : ఒకచోట వరదలు.. మరోచోట వాన జాడే లేదు.!
-
Kaatalan OTT Release: నిజమైన ఏనుగుతో ఫైట్.. సునీల్, లోకేష్ నటించిన 8.2 రేటింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి!
-
Josh Hazlewood: 13 నెలల నిరీక్షణకు తెర.. మళ్లీ టెస్టు బరిలోకి.. ప్రత్యర్థి ఎవరంటే..
-
KJQ Pre Release Event: ఫ్యాన్స్ కు పూనకాలే.. డిసెంబర్ 2న ప్రభాస్ ‘ఫౌజీ’ ప్రీమియర్స్ .. KJQ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్
-
Child Murder : మద్యం మత్తులో కన్నబిడ్డను చెరువులో ముంచిన తల్లి..
ట్రెండింగ్
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్‌మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్‌తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!