IPL 2026 Awards Winners List: వైభవ్ సూర్యవంశీ హవా.. ఐపీఎల్ 2026లో అవార్డ్స్ గెలుచుకున్న స్టార్ ప్లేయర్స్ వీరే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2026 Awards Winners List: ఐపీఎల్ 2026 సీజన్‌కు తెరపడింది. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ ను ఐదు వికెట్ల తేడాతో ఓడించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండోసారి టైటిల్‌ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. కెప్టెన్ రజత్ పటిదార్ (Rajat Patidar) సారథ్యంలో ఆర్సీబీ ఐపీఎల్ చరిత్రలో టైటిల్‌ను విజయవంతంగా డిఫెండ్ చేసిన మూడో జట్టుగా నిలిచింది.
మరోవైపు ఈ సీజన్ అవార్డుల వేడుకలో మాత్రం అందరి దృష్టిని ఆకర్షించిన పేరు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. కేవలం 15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026 సీజన్‌ను తన పేరిట మార్చుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున అద్భుత ప్రదర్శన కనబరిచిన అతడు ఏకంగా ఐదు ప్రతిష్ఠాత్మక అవార్డులను గెలుచుకున్నాడు. రూ.40 లక్షల ప్రైజ్ మనీతో పాటు సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ అవార్డుతో టాటా సియెర్రా కారును కూడా సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్లో 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్‌ను గెలుచుకున్న వైభవ్, అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా కూడా నిలిచాడు. అంతేకాకుండా మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ (MVP), ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్, ఫాంటసీ కింగ్ ఆఫ్ ది సీజన్, సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ అవార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
Also Read
- CM Revanth Reddy : కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కుట్రలు.. బీఆర్ఎస్కు సామాజిక బహిష్కరణ తప్పదు
- AP Weather Update: ఈదురు గాలులతో వర్షాలు.. ఈ జిల్లాల్లో కీలక హెచ్చరికలు జారీ..
- Duleep Trophy: అద్భుత ప్రదర్శన చేసిన వైభవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ.. పలు రికార్డులు బద్దలు..
- Tirumala Tirupati: తిరుమలలో ఎల్‌నినో ఎఫెక్ట్.. మరో 120 రోజులకు మాత్రమే నీళ్లు..
అవార్డుల కార్యక్రమం అనంతరం మాట్లాడిన వైభవ్ సూర్యవంశీ తన సీజన్ అనుభవాలను పంచుకున్నాడు. “ఇంత పెద్ద వేదికపై మాట్లాడడం కొంత ఒత్తిడిగా అనిపిస్తోంది. వచ్చే ఏడాది ఇంకా మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తాను. నాకు మొదటి బంతినే బౌండరీకి పంపగలననే నమ్మకం ఉంటే ఎలాంటి సందేహం లేకుండా షాట్ ఆడతాను” అని అన్నారు. అయితే ఈ సీజన్ తనకు ఎన్నో పాఠాలు నేర్పిందని కూడా తెలిపాడు. “ప్రతి బంతినీ బలంగా కొట్టడం సాధ్యం కాదని నేర్చుకున్నాను. ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి, మ్యాచ్ పరిస్థితులను ఎలా అర్థం చేసుకోవాలి, జట్టుకు అవసరమైన విధంగా ఎలా ఆడాలనే విషయాలు తెలుసుకున్నాను. ఇకపై ఫిట్‌నెస్‌పై మరింత దృష్టి పెట్టి గాయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను” అని వెల్లడించాడు.
IPL 2026 అవార్డుల పూర్తి జాబితా:
ఆరెంజ్ క్యాప్: వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) – 776 పరుగులు.
పర్పుల్ క్యాప్: కగిసో రబడ (Kagiso Rabada) – 29 వికెట్లు.
మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ (MVP): వైభవ్ సూర్యవంశీ – 436.5 MVP పాయింట్లు.
ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్: వైభవ్ సూర్యవంశీ.
ఫాంటసీ కింగ్ ఆఫ్ ది సీజన్: వైభవ్ సూర్యవంశీ.
మోస్ట్ ఫోర్స్ ఆఫ్ ది సీజన్: సాయి సుధర్సన్ (Sai Sudharsan) – 75 ఫోర్లు.
మోస్ట్ సిక్సెస్ ఆఫ్ ది సీజన్: వైభవ్ సూర్యవంశీ – 72 సిక్సర్లు.
క్యాచ్ ఆఫ్ ది సీజన్: మనీష్ పాండే (Manish Pandey) – ఆర్సీబీ-కేకేఆర్ మ్యాచ్‌లో టిమ్ డేవిడ్‌ను ఔట్ చేసిన అద్భుత వన్-హ్యాండ్ క్యాచ్.
సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్: వైభవ్ సూర్యవంశీ (టాటా సియెర్రా కారు బహుమతి).
మోస్ట్ డాట్ బాల్స్ అవార్డు: మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) – 172 డాట్ బాల్స్.
ఫెయిర్ ప్లే అవార్డు: పంజాబ్ కింగ్స్ (Punjab Kings).
ఉత్తమ పిచ్, గ్రౌండ్ అవార్డులు:
ఐపీఎల్ 2026లో అత్యుత్తమ పిచ్ & గ్రౌండ్ నిర్వహణకు “క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్” కు అవార్డు దక్కించుకుంది. నాలుగు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లను విజయవంతంగా నిర్వహించినందుకు ఈ సంఘానికి రూ.50 లక్షల నగదు బహుమతి లభించింది. అలాగే తక్కువ మ్యాచ్‌ల విభాగంలో హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ గుర్తింపు పొందింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కుట్రలు.. బీఆర్ఎస్కు సామాజిక బహిష్కరణ తప్పదు
-
Jawa 42 All Stars Edition: జావా 42 ఆల్ స్టార్స్ ఎడిషన్ బైక్ లాంచ్.. 27.1hp పవర్, డ్యూయల్ ఛానల్ ABS, ధర ఎంతంటే?
-
AP Weather Update: ఈదురు గాలులతో వర్షాలు.. ఈ జిల్లాల్లో కీలక హెచ్చరికలు జారీ..
-
Duleep Trophy: అద్భుత ప్రదర్శన చేసిన వైభవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ.. పలు రికార్డులు బద్దలు..
-
PM Surya Ghar Yojana: సామాన్య ప్రజలకు సూపర్ బెనిఫిట్.. 56 లక్షల కుటుంబాలకు జీరో కరెంట్ బిల్ .. ఇదే ఆ స్కీమ్ ! ఒక లుక్ వేయండి..
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!