IPL 2025: ఫ్రాంచైజీల డిమాండ్‌కే బీసీసీఐ మొగ్గు.. ఎంతమందిని రిటైన్ చేసుకోవచ్చంటే?
- నవంబర్ నెలలో మెగా వేలం
- రిటెన్షన్ లిస్ట్‌పై బీసీసీఐ కసరత్తు
- ఫ్రాంచైజీల డిమాండ్‌కే బీసీసీఐ మొగ్గు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BCCI on IPL 2025 Retention: ఐపీఎల్ 2025కి సంబంధించి రిటెన్షన్, మెగా వేలం కోసం తేదీని బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే నివేదికల ప్రకారం.. నవంబర్ నెలలో మెగా వేలం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. భారతదేశంలో కాకుండా విదేశాలలో వేలం ప్రక్రియ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. ప్రస్తుతం మెగా వేలంపై బీసీసీఐ ఫోకస్ పెట్టింది. రిటెన్షన్ పాలసీ గురించి ఇప్పటికే ఫ్రాంచైజీలతో సమావేశమైన బీసీసీఐ.. అధికారికంగా ప్రకటించేందుకు మాత్రం సమయం తీసుకుంటోంది. రిటెన్షన్ పాలసీపై బీసీసీఐ, ప్రాంచైజీల మధ్య సమావేశం అసంతృప్తిగా ముగియడమే ఇందుకు కారణం.
ఎక్కువ మందికి రిటెన్షన్ అనుమతి ఇవ్వాలని బీసీసీఐని ప్రాంచైజీలు కోరుతున్నాయట. అందుకే రిటెన్షన్ పాలసీని ప్రకటించేందుకు బీసీసీఐ సమయం తీసుకుంటున్నది. అయితే ఫ్రాంచైజీల డిమాండ్‌కే బీసీసీఐ మొగ్గు చూపుతోందని తెలుస్తోంది. ప్రతీ ప్రాంచైజీకి నలుగురు ఆటగాళ్ల రిటెన్షన్, రెండు రైట్ టు మ్యాచ్ (ఆర్‌టీఎమ్) కార్డ్స్ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఆరుగురు ఆటగాళ్లను ప్రతీ టీమ్ అట్టిపెట్టుకోవచ్చు. అంటే నలుగురిని నేరుగా రిటైన్ చేసుకుంటే.. మరో ఇద్దరిని వేలంలో ఆర్‌టీఎమ్ ద్వారా తిరిగి కొనుగోలు చేయవచ్చు. ఇందులో అన్‌క్యాప్‌డ్ ప్లేయర్స్ కూడా ఉంటారు.
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
Also Read: IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్ సంచలన నిర్ణయం.. రిటైన్ లిస్ట్ ఇదే!
బీసీసీఐ, ప్రాంచైజీల మధ్య ముగ్గురు ఆటగాళ్ల రిటెన్షన్ గురించి కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. నలుగురు ఆటగాళ్ల రిటైన్‌కే ఎక్కువ ఫ్రాంచైజీలు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ముగ్గురు ఆటగాళ్ల రిటెన్షన్‌తో పాటు మూడు ఆర్‌టీఎమ్ కార్డ్స్ ఇవ్వాలని ప్రాంఛైజీలు డిమాండ్ చేశాయట. దాంతో బీసీసీఐ నలుగురు ఆటగాళ్ల రిటెన్షన్‌తో పాటు రెండు ఆర్‌టీఎమ్ కార్డ్స్ ఇచ్చేందుకు మొగ్గు చూపినట్లు సమాచారం. ఇందులో మార్క్యూ ఆటగాళ్లతో పాటు ఎమర్జింగ్ ప్లేయర్స్, అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. త్వరలోనే రిటెన్షన్ పాలసీ గురించి బీసీసీఐ అధికారిక ప్రకటన చేయనుంది.
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!