Site icon NTV Telugu

RR vs RCB : టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఆర్సీబీ.. 2023 సీన్ రిపీట్ అవుతుందా?

Rcb Rr

Rcb Rr

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 మ్యాచ్ నంబర్-28లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ (RR) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడనుంది. ఈ రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బెంగళూరు జట్టుకు రజత్‌ పటిదార్‌ నాయకత్వం వహిస్తుండగా.. రాజస్థాన్ కెప్టెన్‌గా సంజు శాంసన్ ఉన్నాడు.

READ MORE: Shocking News: ఆస్తి కోసం దారుణం.. మహిళకు బలవంతంగా మద్యం తాగించి, హత్య..

ప్రస్తుత సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐదు మ్యాచ్‌లు ఆడగా, అందులో మూడు గెలిచింది. మరోవైపు, రాజస్థాన్ రాయల్స్ కూడా అదే సంఖ్యలో మ్యాచ్‌లు ఆడినప్పటికీ రెండు గెలిచింది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ రెండు జట్లకు చాలా కీలకం. తాజా మ్యాచ్‌లో బెంగళూరు జట్టులో ఎలాంటి మార్పులు లేవు. రాజస్థాన్‌ జట్టులో మాత్రం ఫరూకి స్థానంలో హసరంగను బరిలోకి దించుతున్నారు. మరోవైపు.. 2023లో రాజస్థాన్‌ రాయల్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు ఇదే వేదికగా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ 59 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. 112 పరుగుల భారీ తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.

READ MORE: Marriage : పిల్ల దొరుకుతలేదు.. పెరుగుతున్న పెళ్లికాని ప్రసాదులు..

Exit mobile version