IPL 2025 Auction: భారత జట్టులో ఆరుగురు ఆటగాళ్లకు చోటు.. ఐపీఎల్ ప్రాంచైజీలకు పెద్ద బొక్క!
- ఆరుగురు ఆటగాళ్లకు అవకాశం
- టీమిండియాలోకి ఆరుగురు అరంగేట్రం
- ప్రాంచైజీలకు పెద్ద బొక్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025 మెగా వేలంకు సంబంధించిన రిటెన్షన్ రూల్స్‌ను ఇటీవల ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈసారి రిటెన్షన్ పరిమితిని ఆరుగురు ఆటగాళ్లకు పెంచింది. ఇందులో ఒక రైట్ టు మ్యాచ్ (ఆర్‌టీఎం) ఆప్షన్ ఉంది. అక్టోబర్ 31వ తేదీ లోపు అన్ని ఫ్రాంచైజీలు రిటెన్షన్ లిస్ట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. వేలం నవంబర్ మూడో వారంలో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వేలం సందర్భంగా ప్రాంచైజీలకు పెద్ద బొక్క పడే అవకాశం ఉంది.
ఐపీఎల్ 2024 అనంతరం ఆరుగురు భారత ఆటగాళ్లకు టీమిండియాలో చోటు దక్కింది. ఇటీవలి కాలంలో రియాన్ పరాగ్, తుషార్ దేశ్‌పాండే, సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్‌లు టీమిండియాలోకి అరంగేట్రం చేశారు. దాంతో వీరికి అన్‌క్యాప్డ్ ప్లేయర్ అనే ట్యాగ్ పోయింది. వీరిని రూ.4 కోట్లతో రిటైన్ చేసుకునే వెసులుబాటు ప్రాంచైజీలకు ఉండదు. ఒకవేళ రిటైన్ చేసుకుంటే.. కనీసం రూ.11 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. దాంతో ప్రాంచైజీలకు పెద్ద బొక్క పడనుంది. ఈ భారత ఆటగాళ్లను ప్రాంచైజీలు ఇంతకు కొంటాయో చూడాలి.
Also Read
- CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
- CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
Also Read: Gold Rate Today: గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. నేడు తులంపై ఎంత తగ్గిందంటే?
రియాన్ పరాగ్ (రాజస్థాన్ రాయల్స్), తుషార్ దేశ్‌పాండే (చెన్నై సూపర్ కింగ్స్), సాయి సుదర్శన్ (గుజరాత్ టైటాన్స్), అభిషేక్ శర్మ (సన్‌రైజర్స్ హైదరాబాద్), నితీశ్ కుమార్ రెడ్డి (సన్‌రైజర్స్ హైదరాబాద్), మయాంక్ యాదవ్ (లక్నో సూపర్ జెయింట్స్)కు ఆడుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2024లో రియాన్, అభిషేక్, నితీశ్, తుషార్ రాణించిన విషయం తెలిసిందే. మయాంక్ గాయపడి నాలుగు మ్యాచ్‌లే ఆడినా.. 7 వికెట్స్ పడగొట్టాడు. దాంతో వీరికి భారీ ధర పలికే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
-
CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
-
Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?