ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024, 24వ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ కు చెందిన రియాన్ పరాగ్, కుల్దీప్ సేన్ మధ్య మైదానంలో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. గుజరాత్ టైటాన్స్ ఉత్కంఠభరితమైన మ్యాచ్ లో చివరి బంతి వరకు మ్యాచ్ ను తీసుకొచ్చి విజయాన్ని అందుకుంది. గుజరాత్ టైటాన్స్ లక్ష్య ఛేదనలో తొమ్మిదో ఓవర్ లో.. గుజరాత్ బాట్స్మెన్ సాయి సుదర్శన్ స్కూప్ షాట్‌కు ప్రయత్నించాడు. అది తప్పిపోయిన బంతి అతని ప్యాడ్ లను తాకింది. కుల్దీప్ సేన్ వెంటనే అప్పీల్ చేసినా అంపైర్ కదలకుండా ఉండిపోయాడు. దాంతో కెప్టెన్ సంజూ శాంసన్ వెంటనే రివ్యూను ఎంచుకున్నాడు.
Also read: Couple In Flight: వీళ్ళకి ఎక్కడ ప్లేస్ దొరకలేదేమో.. ఫ్లైట్ లో అందరిముందే ఏకంగా..?
ఇక రీప్లేలను పరిశీలిస్తున్నప్పుడు., పిచ్ కి దగ్గరగా నిలబడిన పరాగ్ , ఊహించని విధంగా సేన్ స్క్రీన్ ను చూడకుండా అడ్డుకున్నాడు. రివ్యూ ఫలితాన్ని చూసే అవకాశాన్నికుల్దీప్ సేన్ కి నిరాకరించాడు. “తూ మత్ దేఖ్, తు మత్ దేఖ్” (మీరు చూడకండి, మీరు చూడకండి) అని పరాగ్ చెప్పడం అక్కడ క్లియర్ గా కనిపించింది. ఇక రీప్లేలో చివరికి మూడు ఎరుపు రంగులు కనిపించడంతో.. సాయి సుదర్శన్ వెనుతిరిగారు. ఇక సాటి ఆటగాడు ధృవ్ జురెల్ తో పాటు పరాగ్ , కుల్దీప్ సేన్ అందరూ వికెట్ పాపడడంతో తెగ ఎంజాయ్ చేసారు.
Also read: Pushpa2 : పుష్ప 2 లో పవన్ కళ్యాణ్.. ఇండస్ట్రీ షేక్ అయ్యే న్యూస్ ఇది..
ఇక ఈ మ్యాచ్ చివరి వరకు కూడా చాలా హోరాహోరీగా సాగింది. 197 పరుగుల టార్గెట్ ను గుజరాత్ టైటాన్స్ తన ఇన్నింగ్స్‌లో మొదటగా కాస్త నెమ్మదిగా ఇన్నింగ్స్ ని ఆరంభించి., రానురాను స్పీడ్ పెంచడంతో చివరకి విజయాన్ని అందుకున్నారు. ఇకపోతే, ఆఫ్ఘనిస్తాన్ ఆల్-రౌండర్ రషీద్ ఖాన్ కేవలం 11 బంతుల్లో అజేయంగా 24 పరుగులు చేసి, మ్యాచ్ చివరి బంతికి బౌండరీతో ప్రేక్షకులకి థ్రిల్లింగ్ విక్టరీని అందించాడు. ఇక రషీద్ ఖాన్ ఆల్ రౌండ్ ప్రదర్శనకు, అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. దింతో ఈ సీజన్ లో రాజస్థాన్‌కు మొదటి ఓటమిని చవి చూసింది.
"Mat dekh mat dekh mat dekh" 😂 https://t.co/UILPdKcmyV
— TZ𝕏Kraken | #EESAALACUPNAAMDU (@TZxKRAKEN) April 10, 2024