IPL 2023 : బట్లర్ హాఫ్ సెంచరీ.. చెన్నై టార్గెట్176 పరుగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2023 : ఐపీఎల్ 2023లో భాగంగా చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్పూర్తయింది. ఈ మ్యాచులో 20 ఓవరల్లో 8 వికెట్ల నష్టానికి రాజస్థాన్ రాయల్స్ 175 పరుగులు సాధించింది. తన ప్రత్యర్థి చెన్నైకి 176 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రాజస్థాన్బ్యాట్స్ మెన్ లలో జోస్బట్లర్హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. పడిక్కల్, అశ్విన్రాణించగా.. కెప్టెన్సంజూ నిరాశపరిచాడు. చెన్నై బౌలర్లలో ఆకాశ్ సింగ్, తుషార్ దేశ్‌పాండే, జడేజా తలో రెండు వికెట్లు తీయగా.. మెయిన్ అలీ ఒక వికెట్ తీశాడు.
Read Also: IPL 2023 : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్
Also Read
- Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
- Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
- Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
- India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్‌పై ఆగ్రహం..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్మ్యాచ్ కి మంచి శుభారంభం ఇచ్చారు. మ్యాచ్ ప్రారంభంలోనే రాజస్థాన్ జట్టు మొదటి వికెట్ కోల్పోయింది. తుషార్ దేశ్‌పాండే వేసిన రెండో ఓవర్‌లో నాలుగో బంతికి యశస్వీ జైస్వాల్ (10) మిడాఫ్‌లో శివమ్ దూబేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన దేవదత్ పడిక్కల్ (38) ఔటయ్యాడు. జడేజా వేసిన 8.3 ఓవర్‌కు డేవాన్ కాన్వేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్సంజూ శాంసన్ జడేజా వేసిన 8.5 ఓవర్‌కు సంజూ శాంసన్ (0) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఆకాశ్ సింగ్ వేసిన 15 ఓవర్‌లో రెండు, మూడు బంతులను సిక్సర్లుగా మలిచిన ఆల్రౌండర్అశ్విన్ (30) ఇదే ఓవర్‌లో చివరి బంతికి మగాలాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
Read Also: IPL 2023 : చరిత్ర సృష్టించిన ధోని.. సీఎస్‌కే కెప్టెన్‌గా 200వ మ్యాచ్
ఓపెనర్‌గా వచ్చి దుమ్మురేపిన బట్లర్ ఔటయ్యాడు. మొయిన్ అలీ వేసిన 17 ఓవర్లో రెండో బంతికి జోస్ బట్లర్ (52) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. తర్వాత వచ్చిన ధ్రువ్ జురెల్.. నాలుగు పరుగుల సాధించి ఆకాశ్ సింగ్ బౌలింగ్‌లోనే క్యాచ్ ఔటయ్యాడు. జేసన్ హోల్డర్, జంపా డకౌట్‌గా పెవిలియన్ చేరారు. హెట్ మెయర్(30*) నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా రాజస్థాన్ 175 పరుగులు సాధించింది.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్‌పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!