iPhone Update: స్పైవేర్‌ను చొప్పించేందుకు హ్యాకర్ల యత్నం.. ఐఫోన్లకు అత్యవసర అప్డేట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iPhone users need to Apple update urgently: యాపిల్ కంపెనీ తమ ఐఫోన్ యూజర్లకు అత్యవసర సెక్యూరిటీ అప్డేట్లను రిలీజ్ చేసింది. హ్యాకర్లు ఐఫోన్లలోకి స్పైవేర్‌ను చొప్పించేందుకు అవకాశం ఉందని గుర్తించి ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు గుర్తించని కొన్ని లోపాలను ఉపయోగించుకొని.. హ్యాకర్లు ఐఫోన్లలోకి స్పైవేర్‌ను ప్రవేశపెట్టేందుకు యత్నించినట్లు యాపిల్ తెలిసింది. అప్రమత్తమైన యాపిల్ సెక్యూరిటీ అప్డేట్లను అందించింది.
సిటిజన్ ల్యాబ్ అనే ఇంటర్నెట్ వాచ్డాగ్ ఐఫోన్ సాఫ్ట్‌వేర్‌లోని లోపాలను గుర్తించి.. యాపిల్ కంపెనీకి తెలియజేసింది. వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ సివిల్ సొసైటీ ఉద్యోగి ఫోన్లోకి పెగాసస్ అనే నిఘా సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించినట్లు సిటిజన్ ల్యాబ్ పరిశోధకులు గుర్తించారు. ఆ యూజర్ ఏమీ చేయకుండానే.. ఫోన్లో ఇన్స్టాల్ అయ్యేలా మాల్వేర్ను చొప్పించాలని చూసినట్లు తెలిపింది. స్పైవేర్ యాక్టివేట్ అయితే.. యూజర్‌కు తెలియకుండానే కెమెరా ఆన్ కావడం, వాయిస్ రికార్డవ్వడం వంటివి వాటంతట అవే జరుగుతాయని పేర్కొంది.
Also Read
- Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
- Alluri District Tribal Bandh: అల్లూరి జిల్లాలో ఆదివాసీల బంద్.. స్వల్ప ఉద్రిక్తత.!
- Hyderabad: స్టేడియం వద్ద కిక్కిరిసిన నిరుద్యోగులు.. హైడ్రా ఉద్యోగాల కోసం క్యూ కట్టిన వేలాది మంది!
- Vaibhav Sooryavanshi: "ఫుడ్ విషయంలో తగ్గేదేలే".. వైభవ్ సూర్యవంశీ డైట్ సీక్రెట్ ఇదేనట..
Also Read: Asia Cup 2023: సూపర్-4 మ్యాచ్‌లన్నీ వాష్ అవుట్ అయితే.. ఫైనల్ చేరే జట్లేవో తెలుసా? అస్సలు ఊహించరు
ఐఫోన్‌లోని లోపాలను సిటిజన్ ల్యాబ్స్ ‘జీరో-డే-బగ్స్’గా పేర్కొంది. అంటే.. లోపాలను సరిదిద్దడానికి యాపిల్ కంపెనీ వద్ద కనీసం ఒక్కరోజు కూడా సమయం లేదని అర్థం. యాపిల్ ఈ లోపాలను వెంటనే సరిదిద్ది.. సెక్యూరిటీ అప్డేట్స్ను తమ యూజర్లకు అందించింది. ఐఫోన్ వాడుతున్న వారు వెంటనే ఈ సెక్యూరిటీ అప్డేట్లను చేసుకోవడం ఉత్తమం అని నిపుణులు అంటున్నారు.
తాజావార్తలు
-
ISRO Recruitment: ఇంజనీరింగ్ అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్.. ఇస్రోలో జాబ్స్‌కి నోటిఫికేషన్!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
Fazilka Border Drone Arms Smuggling: ఫాజిల్కా సరిహద్దు వద్ద పాకిస్థాన్ కుట్ర భగ్నం.. డ్రోన్, పిస్టల్, తూటాలు స్వాధీనం
-
Hollywood Box Office: ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ vs ‘ది ఒడిస్సీ’.. షేక్ అవుతున్న బాక్సాఫీస్.. కలెక్షన్స్ లో ఎవరిది పైచేయి?
-
Irumudi Trailer: భీమవరంలో రవితేజ హంగామా.. ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్ అక్కడే!
ట్రెండింగ్
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!