దీపావళి అంటేనే మార్కెట్లో డిస్కౌంట్ ఆఫర్ల వర్షం కురుస్తుంది. ఇప్పుడు యాపిల్ ఐఫోన్ పై కూడా భారీగా ఆఫర్లు ప్రకటించారు. కొత్తగా ఐఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశమని చెప్పవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14కు భారీగా ధరలు తగ్గించారు. రూ. 20,000 లోపు కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. బిగ్ దీపావళి సేల్‌లో వేల రూపాయల తగ్గింపుతో ఐఫోన్ 14ని కొనుగోలు చేయవచ్చు.
ఆపిల్ ఈ ఏడాది ఐఫోన్ 15 సిరీస్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే iPhone 14 మోడల్‌ను కొనుగోలు చేయాలనుకునే వారు కూడా కొందరు ఉంటారు. అందుకోసమని.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు ఐఫోన్ 14 సిరీస్‌పై తగ్గింపు ఆఫర్‌లను అందిస్తున్నాయి. ఐఫోన్ 14ను మాత్రమే కొనుగోలు చేయాలనుకుంటే.. ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌ను చూడవచ్చు. అంతేకాకుండా.. బిగ్ దీపావళి సేల్ చివరి తేదీ ఈరోజే.
Shoaib Malik: పాక్ కన్నా ఆఫ్ఘాన్ బెటర్.. సొంత జట్టుపై విమర్శల వెల్లువ
ఐఫోన్ 14: ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ ఎలా ఉందంటే..
ఐఫోన్ 14.. 128GB మోడల్ అసలు ధర రూ.69,900. మీరు ఈ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, ఎక్కువగా డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ మోడల్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 57,999కే లభిస్తుంది. అంటే రూ. 11,901 ప్రత్యక్ష తగ్గింపును అందిస్తోంది. అంతేకాకుండా.. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయాలనుకుంటే, ఇతర ఆఫర్‌ల వివరాలను కూడా తనిఖీ చేయండి.
ఎక్స్ఛేంజ్ ఆఫర్
ఐఫోన్ 14 డీల్‌పై ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. పాత ఫోన్‌కు బదులుగా కొత్త ఐఫోన్‌ను కొనుగోలు చేస్తే మీరు రూ. 42,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్‌ను పొందుతారు. మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్ పూర్తి ప్రయోజనాన్ని పొందడంలో విజయవంతమైతే, ఐఫోన్ 14 ధర రూ.15,999కి తగ్గుతుంది. ఈ విధంగా మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 20,000 కంటే తక్కువ ధరలో పొందుతారు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ 128GB, 512GB స్టోరేజ్ వేరియంట్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీ పాత ఫోన్ మోడల్ ను బట్టి మీరు ఎంత ఎక్స్చేంజ్ ప్రయోజనం పొందుతారో తెలుస్తుంది.
ఐఫోన్ 14: స్పెసిఫికేషన్‌లు
ఐఫోన్ 14.. 6.1 అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డిఆర్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇందులో 12MP+12MP కెమెరా (వెనుక), 12MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు A15 బయోనిక్ చిప్‌సెట్, 6-కోర్ ప్రాసెసర్ కలిగి ఉంది.