NTV Telugu Site icon

iPhone 13 Mini Price 2023: ఐఫోన్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఐఫోన్ 13 మినీపై రూ. 18200 ఆదా!

Iphone 13 Mini

Iphone 13 Mini

Buy iPhone 13 Mini Only Rs 46700 in Vijay Sales: ప్రస్తుతం యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ సహా ఐఫోన్ 13 మినీ కూడా ట్రెండింగ్ మోడల్. ఐఫోన్ 13 మినీ విక్రయాలు ఇప్పటికీ బాగానే ఉన్నాయి. అయితే మీరు స్టోర్‌లో ఈ మోడల్‌ను కొనుగోలు చేయడానికి వెళితే.. జేబు పూర్తిగా ఖాళీ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు జేబు ఖాళీ కాకుండా.. ఐఫోన్ 13 మినీని కొనుగోలుచేయొచ్చు. ఈ ఫోన్ కొనుగోలుపై ప్రస్తుతం అత్యుత్తమ డీల్‌ ఒకటి ఉంది. ఆ ఆఫర్ ద్వారా మీరు రూ. 18200 ఆదా చేసుకోవచ్చు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఐఫోన్ 13 మినీ 128 GB స్టోరేజ్ వేరియంట్‌పై ఆఫర్ ఉంది. విజయ్ సేల్స్‌లో భాగంగా ఐఫోన్ 13 మినీపై ఆఫర్ యాక్టివ్‌గా ఉంది. పింక్ కలర్ మోడల్‌పైనే ఈ ఆఫర్ ఉందని మీరు గుర్తుంచుకోవాలి. ఐఫోన్ 13 మినీ 128 GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 64900లుగా ఉంది. విజయ్ సేల్స్‌లో 28% తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. కస్టమర్‌లు రూ. 18200 తగ్గింపు పొందుతారు. వినియోగదారులు రూ. 46,700కి కొనుగోలు చేయవచ్చు. ఇది పరిమిత ఆఫర్ కాబట్టి వెంటనే కొనేసుకోండి.

Also Read: Black Color Car: బ్లాక్ కలర్ కారుని కొనుగోలు చేయాలనుకుంటున్నారా?.. ఈ నాలుగు విషయాలు గుర్తుంచుకోండి!

ఐఫోన్ 13 మినీ ఫోన్.. ఐఫోన్ 13 కంటే పరిమాణంలో చాలా చిన్నది. అయినా కూడా చూడ్డానికి ఐఫోన్ 13 మినీ చాలా బాగుంటుంది. ఈ ఫోన్‌కి అధిక డిమాండ్‌ ఉండటానికి కారణం ఇది ఒకటి. మీరు డబ్బు ఆదా చేసుకుని ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే.. విజయ్ సేల్స్‌లోని (Vijay Sales-Electronics retail chain) ఆఫర్ వెంటనే ఉపయోగించుకోండి.

ఇక ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13 మినీ (APPLE iPhone 13 mini Pink, 512 GB)పై 5 శాతం ఆఫర్ ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13 మినీ అసలు ధర రూ. 94,900లుగా ఉంది. 5 శాతం ఆఫర్ తర్వాత రూ. 89,999గా ఉంది. అయితే ప్రస్తుతం ఐఫోన్ 13 మినీ ఫ్లిప్‌కార్ట్‌లో అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది.

Also Read: Maruti Brezza Price 2023: రూ. 5 లక్షలకే మారుతి బ్రెజా.. పూర్తి వివరాలు ఇవే!

Show comments