iOS 26 Public Beta: ఆపిల్ తన iOS 26 పబ్లిక్ బీటా వెర్షన్‌ను అధికారికంగా విడుదల చేసింది. WWDC 2025లో ప్రివ్యూకు వచ్చినప్పటికీ.. తాజాగా యూజర్ల కోసం బీటా టెస్టింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. ఈ వెర్షన్‌లో లిక్విడ్ గ్లాస్ డిజైన్, ఆపిల్ ఇంటలిజెన్స్, అనేక యాప్‌లు కొత్త రూపంలో కనిపించనున్నాయి. iOS 26లో ప్రవేశపెట్టిన కొత్త లిక్విడ్ గ్లాస్ డిజైన్ ద్వారా ఐకాన్లు, మెనూలు, అనిమేషన్‌లు మరింత మెరుపుగాను, స్పర్శకు స్పందించేలా మారనున్నాయి. UI అంతా ఫ్లూయిడ్ లుక్‌తో ఉంటుంది. కాబట్టి టచ్‌కు వెంటనే స్పందించేలా అనిపిస్తుంది.
ఇకపోతే, ఫోన్ యాప్‌ను పూర్తిగా రీడిజైన్ చేశారు. ఫేవరిట్స్, రేసెంట్స్, వాయిస్ మెయిల్ అన్నీ ఒకే ఇంటర్‌ఫేస్‌లో కలిపారు. అయినప్పటికీ పాత లేఅవుట్‌కి తిరిగి మారే ఎంపిక కూడా ఉంది. ఇకపోతే ఇందులో కొత్తగా.. Call Screening ద్వారా అపరిచిత కాల్స్‌కు ఆటోమేటిక్ సమాధానాలు ఇవ్వడం, Hold Assist ద్వారా మ్యూజిక్ సమయంలో మనిషి మాట్లాడటం గుర్తించి అలర్ట్ చేయడం, షేర్ ప్లే డురింగ్ కాల్స్, వాయిస్ మెయిల్ సమ్మరీస్ విత్ AI వంటి అదనపు ఫీచర్లు కూడా ఉన్నాయి. వీటితోపాటు మెసేజెస్ యాప్‌కి పర్సనలైజేషన్ టచ్ లో భాగంగా.. చాట్స్‌కి బ్యాక్‌గ్రౌండ్లు (ఫొటోలు, AI-డిజైన్‌లతో), పోల్స్ క్రియేట్ చేసే ఫీచర్,
గ్రూప్ టైపింగ్ సూచనలు, అన్‌నౌన్స్డ్ నంబర్ల నుండి స్పామ్ కంట్రోల్, కొత్తగా ఆపిల్ క్యాష్ ఇంటిగ్రేషన్, యాడ్ కాంటాక్ట్, Search & Selection tools, Info Panel వంటి సింపుల్ ఫీచర్లను రీడిజైన్ చేశారు.
Emmanuel Macron: పాలస్తీనా ఏర్పాటుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మద్దతు.. మండిపడ్డ ట్రంప్, నెతన్యాహు
ఇక కెమెరా యాప్‌లో మంచి ఫొటో, వీడియో యాక్సెస్ ప్రధాన లక్ష్యంగా.. ముఖ్యమైన ఫీచర్లు పోకుండా, వాటిని కొత్తగా స్వైప్ ద్వారా యాక్సెస్ చేయచ్చు. ఇందులో భాగంగా AirPods స్టెమ్ నొక్కితే ఫొటో లేదా వీడియో తీసే సదుపాయం, లెన్స్ క్లీనింగ్ రిమైండర్ పొందవచ్చు. ఇక ఫొటోస్ యాప్‌కి రెండు ట్యాబ్ల లేఅవుట్ అందించనున్నారు. లైబ్రరీ, కలెక్షన్స్ అనే ట్యాబ్లుగా విడదీచారు. ఇక కలెక్షన్స్ వ్యూలో డెన్సిటీ, లేఅవుట్‌ను కస్టమైజ్ చేయచ్చు. స్పటియాల్ సీన్స్ లో ఫొటోలను డెప్త్ ఎఫెక్ట్‌తో చూడవచ్చు.
ఇవే కాకుండా మ్యూజిక్ యాప్‌లో, కార్ ప్లేకి కొత్త డిజైన్ ను తీసుక వచ్చారు. ఇక ఇందులో గేమింగ్‌కి ప్రత్యేక హబ్ తీసుక వచ్చారు. కొత్తగా Apple Games అనే యాప్ ద్వారా App Storeలో ఉన్న అన్ని గేమ్స్, లీడర్‌బోర్డ్లు, చాలెంజెస్‌ని ఒకే చోట చూడొచ్చు. హోమ్ స్క్రీన్ నుంచే యాక్సెస్ చేసుకోవచ్చు. మ్యాప్స్ లో కూడా మీ ప్రయాణ అలవాట్లను గుర్తించి, ట్రాఫిక్ ఉండగా ప్రత్యామ్నాయ మార్గాలు సూచిస్తుంది. Visited Places అనే ఫీచర్‌తో మీరు సందర్శించిన రెస్టారెంట్లు, షాపులు వంటివి ట్రాక్ చేయవచ్చు. వీటితో పాటు విజువల్ ఇంటలిజెన్స్, లైవ్ ట్రాన్స్లేషన్, షార్ట్ కట్స్ లో “Use Model” కమాండ్, Genmoji & Image Playgroundకి కొత్త ఎక్స్‌ప్రెషన్స్, ఇంకా వాలెట్ లో ఆర్డర్ ట్రాకింగ్, మెసేజెస్‌లో బ్యాక్‌గ్రౌండ్, పోల్స్ జనరేషన్, రిమైండర్స్ లో కేటగిరీల విభజన వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
PM Modi: మాల్దీవులు చేరుకున్న మోడీ.. స్వయంగా స్వాగతం పలికిన ముయిజ్జు
iOS 26 పబ్లిక్ బీటా ఇప్పుడు Apple Beta Software Program ద్వారా అందుబాటులో ఉంది. iPhone 11, ఆ తరువాతి మోడళ్లకు ఇది అందుబాటులోకి రానుంది. మొదట ఇంగ్లిష్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, బ్రెజిలియన్ పోర్చుగీస్, స్పానిష్, జపనీస్, కొరియన్, సింప్లిఫైడ్ చైనీస్ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. 2025 చివరికి మరిన్ని భాషలు అందించనున్నట్లు సమాచారం.
