Mutual Funds: ఫిక్స్డ్ డిపాజిట్లు భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందాయి. ఒక సాధారణ పౌరుడికి తాను సంపాదించిన దాంట్లో ఖర్చులు పోను మిగిలింది ఎఫ్డీలో పెట్టుబడి పెడతానికి ఆసక్తి కనబరుస్తాడు. కొంత కాలం తర్వాత తనకు ఎఫ్‌డీ నుంచి మంచి రాబడులు వస్తాయని నమ్మకంగా ఉన్నాడు. కానీ ఇప్పుడు డిజిటల్, సోషల్ మీడియా కారణంగా మ్యూచువల్ ఫండ్స్ ఫేమస్ అవుతున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ పట్ల ప్రజల్లో ఆసక్తి పెరిగింది. ఇప్పుడు గ్రామాల్లో కూడా ప్రజలు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడుతున్నారు, దాని వల్ల మంచి రాబడిని పొందుతున్నారు. ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్లు స్మాల్ క్యాప్ ఫండ్లలో ఎక్కువ పెట్టుబడి పెడుతున్నారు.
ఆగస్టు 2023లో వరుసగా 5వ నెలలో స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో రికార్డు ఇన్‌ఫ్లోలు కనిపించాయి. ఈ కేటగిరీలో రూ.4265 కోట్ల ఇన్ ఫ్లో నమోదైంది. గత ఐదేళ్లలో 31-42 శాతం సిప్ రాబడిని అందించిన కొన్ని స్మాల్ క్యాప్ ఫండ్ల గురించి ఈ రోజు తెలుసుకుందాం.
Read Also:Imphal: మణిపూర్ లో మళ్లీ అల్లర్లు.. ఆ వ్యక్తి కోసమే గొడవ
క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్: క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ రిటైల్ ఇన్వెస్టర్లలో చాలా ప్రసిద్ధి చెందింది. గత 5 ఏళ్లలో దీని పనితీరు చాలా బాగుంది. గత 5 సంవత్సరాలలో క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ సగటు సిప్ రాబడి సంవత్సరానికి 42.69 శాతంగా ఉంది. ఈ పథకంలో నెలకు రూ.10,000 ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిదారుడి పెట్టుబడి విలువ 5 ఏళ్లలో రూ.16.82 లక్షలకు పెరిగింది. మీరు నెలకు రూ. 1000తో కూడా క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్‌లో సిప్ ప్రారంభించవచ్చు.
నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్: క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ లాగా, నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ కూడా బాగా పనిచేసింది. ఇది గత 5 సంవత్సరాలలో దాని పెట్టుబడిదారులకు భారీ రాబడిని ఇచ్చింది. ఈ పథకం గత 5 సంవత్సరాల సగటు సిప్ రాబడి సంవత్సరానికి 35.8 శాతంగా నమోదు చేయబడింది. ఇందులో మీరు కనీసం రూ. 5000 పెట్టుబడి పెట్టవచ్చు. సిప్ ద్వారా పెట్టుబడి పెట్టాలనుకుంటే .. కనీసం రూ. 1000తో ఇన్వెస్ట్ మెంట్ చేయవచ్చు.
హెచ్ఎస్బీసీ స్మాల్ క్యాప్ ఫండ్: హెచ్ఎస్బీసీ కూడా అద్భుతమైన రాబడిని ఇచ్చే స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 5 సంవత్సరాలలో దాని సగటు సిప్ రాబడి వార్షికంగా 31.82 శాతంగా ఉంది. ఈ పథకంలో 5 సంవత్సరాల పాటు ప్రతి నెలా 10,000 సిప్ చేస్తున్న పెట్టుబడిదారుడు రూ. 13.08 లక్షలు పొందారు. ఐదేళ్ల కాలంలో హెచ్ఎస్బీసీ స్మాల్ క్యాప్ ఫండ్ సగటు సిప్ రాబడి సంవత్సరానికి 31.16 శాతంగా ఉంది. విశేషమేమిటంటే ఈ పథకంలో సిప్ కేవలం 100 రూపాయల నుండి మాత్రమే ప్రారంభమవుతుంది.
Read Also:Telangana Rains: తెలంగాణకు వర్ష సూచన.. 16 జిల్లాలకు ఎల్లో అలెర్ట్