Nuh Voilence: నుహ్‌లో మరోసారి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత.. 144 సెక్షన్ విధింపు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత జూలైలో నుహ్‌లో జరిగిన హింసాకాండ.. ఎంతటి విధ్వంసం సృష్టించిందో అందరికి తెలిసిందే. అయితే మరోసారి అలాంటి హింసలకు పాల్పడకుండా ఉండేందుకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. కారణమేంటంటే.. ఆగస్టు 28న బ్రిజ్ మండల్ ఆధ్వర్యంలో సర్వ్ జాతీయ హిందూ మహాపంచాయత్ ‘శోభా యాత్ర’ చేపట్టనున్నారు. దీంతో మతపరమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న నుహ్ జిల్లాలో మొబైల్ ఇంటర్నెట్ మరియు బల్క్ SMS సేవలను ఆగస్టు 28 వరకు నిలిపివేయాలని హర్యానా ప్రభుత్వం శనివారం ఆదేశించింది.
Viral Video: దాహం వేసి నీటి కోసం కష్టపడుతున్న కుక్క.. ఓ మహిళ ఏం చేసిందంటే
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
సోమవారం నిర్వహించే ఈ ర్యాలీ సమయంలో సోషల్ మీడియా ద్వారా పుకార్లు వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అడిషనల్ చీఫ్ సెక్రటరీ (హోమ్) టీవీఎస్ఎన్ ప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ముందుజాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు సమావేశాన్ని నిషేధిస్తూ 144 సెక్షన్ కూడా విధించారు. ఈ ఉత్తర్వులు ఆగస్టు 26-28 వరకు అమల్లోకి వస్తాయని అధికారులు తెలిపారు.
Veena Srivani: వేణుస్వామి భార్య ట్యాలెంట్ ను చూశారా.. మతిపోవాల్సిందంతే
అంతేకాకుండా.. లైసెన్స్ పొందిన తుపాకులు, లాఠీలు, గొడ్డళ్లు ఇతర ఆయుధాలను ఎవరూ తీసుకెళ్లడానికి లేదని పోలీసులు పేర్కొన్నారు. గతంలో కూడా మత ఘర్షణలు చెలరేగడంతో నుహ్‌లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. జులై 31న నుహ్‌లో చెలరేగిన మత ఘర్షణల్లో ఇద్దరు హోంగార్డులు, ఒక మతగురువు సహా ఆరుగురు మరణించారు.
Rashmi Gautam: బాత్ టబ్‌లో రష్మీ గౌతమ్ టీజింగ్.. ఆ ఒక్కటి చూపించమంటున్న నెటిజన్లు
మరోవైపు నుహ్ లో శోభా యాత్ర నేపథ్యంలో నూహ్ డిప్యూటీ కమిషనర్ ధీరేంద్ర ఖడ్గత ప్రసాద్‌కు లేఖ రాశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా సామాజిక వ్యతిరేక శక్తులు సోషల్ మీడియా/బల్క్ మెసేజ్‌లను దుర్వినియోగం చేస్తున్నారనే భయం ఉందని తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని అడిషనల్ చీఫ్ సెక్రటరీని కోరారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!