Women’s Day 2026:జగతికి జీవం పోసిన జోలపాటకు.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ రోజు మార్చి 8. లోకమంతా మహిళల గొప్పతనం గురించి మాట్లాడుకునే రోజు. కానీ నిజానికి ఒక స్త్రీ విలువను కొలవడానికి ఈ ఒక్క రోజు సరిపోతుందా? త్యాగానికి మరో రూపం స్త్రీ అని అంటాం, కానీ ఆ త్యాగం వెనుక ఆమె ఎంతటి మౌన పోరాటాన్ని దాచుకుంటుందో మనమెప్పుడైనా గమనించామా? ఉదయం అందరికంటే ముందు నిద్రలేచి, రాత్రి అందరూ పడుకున్నాక విశ్రమించే ఒక “అమ్మ”లో ఎన్ని అలసటలు ఉన్నాయో ఆమె ఎప్పుడూ చెప్పదు. తన ఆశలను, కలలను మూటగట్టి అటక మీద పడేసి, పిల్లల భవిష్యత్తు కోసం, భర్త సంతోషం కోసం చిరునవ్వుతో బ్రతికేస్తుంటుంది. మండుతున్న ఎండలో చెమట చిందుస్తూ ఇంటిని చల్లబరిచే చలువ పందిరి ఆమె.
ఆడపిల్లగా పుట్టినప్పటి నుండి అడుగడుగునా ఆంక్షల మధ్య ఎదుగుతూ, పెళ్లయ్యాక కన్నవారిని వదిలి పరాయి ఇంటికి వెళ్ళి, అక్కడ అందరినీ తనవారిగా చేసుకునే గుండె ధైర్యం ఒక్క స్త్రీకే సాధ్యం. ఆమె కంట్లో నీరు వస్తే ఆ ఇల్లు అరిష్టమని అంటారు, కానీ ఆ కన్నీరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యతను మాత్రం మర్చిపోతుంటారు. చదువులో, ఉద్యోగంలో, అంతరిక్షంలో.. నేడు మహిళలు ఆకాశమంత ఎత్తుకు ఎదిగారు. అయినా సరే, ఇంటికి రాగానే మళ్ళీ అదే పాత గరిటె పట్టుకుని మన ఆకలి తీరుస్తారు. ఆమె ఓర్పు భూమి కంటే గొప్పది, ఆమె ప్రేమ ఆకాశం కంటే విశాలమైనది.
Also Read
- Iran: ఇరాన్లో ఘోర ప్రమాదం.. ఇంధన ట్యాంకర్ పేలి 11 మంది మృతి..
- Delhi Building Collapse: ఢిల్లీలో కుప్పకూలిన 4 అంతస్తుల భవనం.. శిథిలాల కింద 50 మంది విద్యార్థులు..?
- Vaibhav Sooryavanshi: దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ దూకుడు..
- Rain Alert: మళ్లీ వర్షాల జోరు.. 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. పిడుగులతో భారీ వర్షాలు!
నిజమైన మహిళా దినోత్సవం అంటే కేవలం వాట్సాప్ స్టేటస్‌లు పెట్టడం కాదు.. ఆమెను ఒక మనిషిగా గుర్తించడం, ఆమె కష్టాన్ని గౌరవించడం. రాత్రి పూట ఒంటరిగా బయటకు వెళ్లినా భయం లేని లోకాన్ని ఆమెకు బహుమతిగా ఇవ్వడం. అమ్మా, నువ్వు లేకపోతే ఈ సృష్టికి అర్థమే లేదు. నీ కంటిపాపలో ఒక్క కన్నీటి చుక్క కూడా చేరకుండా చూసుకోవడమే మేము నీకు ఇచ్చే నిజమైన గౌరవం. నువ్వు పడుతున్న ప్రతి కష్టానికి, కురిపిస్తున్న ప్రతి ప్రేమామృతానికి ఈ ప్రపంచం నీకు ఎప్పుడూ రుణపడి ఉంటుంది.
తాజావార్తలు
-
War: అంటుకుంటున్న నిప్పురవ్వలు.. మంటల్లో ప్రపంచం?
-
Iran: ఇరాన్లో ఘోర ప్రమాదం.. ఇంధన ట్యాంకర్ పేలి 11 మంది మృతి..
-
Pakistan Cricket Board: వరుస ఓటములతో పాక్ క్రికెట్లో కలకలం.. మూడో టెస్టుకు ముందే సగం జట్టు మార్పు..
-
Explainer: ఇండియాలో కూడా నేపాల్ తరహా విలయం?
-
Delhi Building Collapse: ఢిల్లీలో కుప్పకూలిన 4 అంతస్తుల భవనం.. శిథిలాల కింద 50 మంది విద్యార్థులు..?
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!