NTV Telugu Site icon

Covid Alert: కరోనా కట్టడిపై కేంద్రం దృష్టి.. నేటి నుంచి విదేశీ ప్రయాణికులకు పరీక్షలు

Covid Alert

Covid Alert

Covid Alert: కరోనా కొత్త వేరియంట్ కలవరపెడుతున్న వేళ కేంద్రం దృష్టి సారించింది. కొవిడ్ నివారణ చర్యలను చేపట్టాలని కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి వేడుకలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు గుమిగూడకుండా చూడాలని, మాస్కులు ధరించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లోనే కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జరపడానికి కేంద్రం నిర్ణయించింది. ప్రయాణికులందరికీ కాకుండా కొందరికి పరీక్షలు జరిపేలా పౌర విమానయాన శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది.

నేటి ఉదయం నుంచి అంతర్జాతీయ విమానాల్లో వచ్చిన ప్రయాణికుల్లో 2 శాతం మందికి పరీక్షలు జరపనున్నారు. ఎంపిక చేసిన వారిన విమానాశ్రయాల్లోనే కొవిడ్ పరీక్ష కేంద్రాలకు తరలిస్తారు. ఎవరికైనా పాజిటివ్ అని తేలితే తదుపరి చర్యలకు గాను ఆ సమాచారాన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపిస్తారు. చైనాతో పాటు ప్రపంచంలోని మరికొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, అంతర్జాతీయ విమానాల్లో వచ్చే ప్రయాణికుల్లో 2 శాతం మందికి శనివారం ఉదయం నుంచి కరోనా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Sania Mirza: దేశంలో తొలి ముస్లిం మహిళా ఫైటర్ పైలట్‌గా సానియా మీర్జా.. కానీ నాలుగేళ్ల తర్వాతే..

కరోనా వైరస్ పరీక్ష ప్రక్రియ కోసం ఆరు రిజిస్ట్రేషన్ కౌంటర్లు, మూడు నమూనా బూత్‌లను ఏర్పాటు చేసినట్లు ముంబై విమానాశ్రయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయ రాకపోకల కోసం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం, ప్రవేశ సమయంలో ఉన్న ఆరోగ్య అధికారులు ప్రయాణీకులందరికీ థర్మల్ స్క్రీనింగ్ చేయాలి. స్క్రీనింగ్ సమయంలో రోగలక్షణాలు ఉన్నట్లు గుర్తించిన ప్రయాణీకులను వెంటనే వేరుచేయాలి, నియమించబడిన వైద్య సదుపాయానికి తీసుకెళ్లాలి. ఫ్లైట్‌ను డిబోర్డ్ చేసే సమయంలో భౌతిక దూరం పాటించాలి.