Pakistan: భారత్ అభివృద్ధిపై పాక్ చట్టసభల్లో ఆసక్తికర చర్చ.. ఏమన్నారంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ ప్రస్తుతం దైనీయ స్థితికి చేరుకుంది. ఈ పరిస్థితిని వివరిస్తూ.. ఆ దేశ చట్టసభ చర్చ జరుగుతోంది. ఈనేపథ్యంలో చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్ మాట్లాడుతూ.. భారత్ చంద్రుడిపై కాలుమోపుతుంటే.. పాక్ (Pakistan) మాత్రం ఇంకా మురుగు కాలువల్లో పిల్లల మరణాలనూ నివారించలేకపోతోందంటూ పేర్కొన్నారు. పార్లమెంటు సాక్షిగా పాక్ దయనీయ స్థితిపై వాపోయారాయన. ఈ ప్రసంగం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. భారత్ కు శత్రుదేశమైన పాక్ లో భారత్ అభివృద్ధిపై కొనసాగుతున్న ఆసక్తికరంగా ఉంది.
READ MORE: Google: గూగుల్ ప్రవేశపెట్టబోతున్న ప్రాజెక్ట్ ఆస్ట్రా అంటే ఏమిటో? తెలుసా..
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
‘‘టీవీలో చంద్రుడిపై భారత్ కాలుమోపినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రెండు సెకన్లలోనే అదే తెరపై కరాచీలో పిల్లలు మురుగు కాలువల్లో పడి మరణించిన సమాచారం వచ్చింది. పాకిస్థాన్‌కు (Pakistan) కరాచీ ప్రధాన ఆదాయ వనరు. రెండు నౌకాశ్రయాలు ఉన్నాయి. దేశానికి ఈ నగరం ముఖద్వారంలాంటిది. కానీ, 15 ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలో తాగునీరు కూడా అందడం లేదు. వచ్చిన కొద్దిపాటి నీటిని కూడా మాఫియా అక్రమంగా విక్రయిస్తోంది. దేశంలో 2.62 కోట్ల మంది పిల్లలు స్కూల్‌కు వెళ్లడం లేదు’’ అంటూ పాక్ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులను సయ్యద్ ముస్తఫా వివరించారు. గత ఏడాది భారత్ చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైన విషయం తెలిసిందే. చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోసిన తొలి దేశంగా రికార్డు సృష్టించింది. మరోవైపు పాక్ (Pakistan) మాత్రం తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోంది. పూర్తిగా ఐఎంఎఫ్ సాయంతో నెట్టుకొస్తోంది. మరిన్ని నిధుల కోసం ప్రస్తుతం చర్చలు జరుపుతోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారాయి.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!