Site icon NTV Telugu

Crime News: అర్ధరాత్రి రూమ్ అద్దెకు కావాలని అడిగిన దొంగలు.. చివరకు!

Thief Gang

Thief Gang

Crime News: ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలకానగర్‌లో అంతర్రాష్ట్ర దొంగల హల్చల్ చేశారు. టూలెట్ బోర్డు ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తోంది ఈ దొంగల ముఠా. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అర్ధరాత్రి ఓ వృద్ధ దంపతుల ఇంటికి వెళ్లి రూమ్ అద్దెకు కావాలని అడిగారు ఆ దొంగలు. అనంతరం ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించారు. బలవంతంగా వృద్ధులను నోట్లో బట్టలు కుక్కి, బంధించి దోచుకెళ్లే ప్రయత్నం చేశారు. వృద్ధ దంపతుల అలజడి విని చుట్టూ ప్రక్కల స్థానికులు వచ్చి దొంగలను పట్టుకొని ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. దొంగలలో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉండగా… వీరు యూపీకి లేదా బీహార్ కి చెందినవారా తెలియాల్సి ఉంది. వారిని అదుపులోకి తీసుకుని ఉప్పల్ పోలీసులు విచారిస్తున్నారు. దొంగలు వచ్చి పోయే దృశ్యాలు సీసీటీవీ లో రికార్డు అయ్యాయి. ఈ ముఠాపై కఠిన చర్యలు చేపట్టాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

Read Also: No Onion: ఘాటెక్కిన ఉల్లి ధర.. రెస్టారెంట్లలో ఉల్లిపాయలు లేవంటూ బోర్డులు..

Exit mobile version