NTV Telugu Site icon

Students Missing: విశాఖలో విద్యార్థుల మిస్సింగ్‌ కలకలం.. ఒకేసారి ముగ్గురు..

Students Missing

Students Missing

Students Missing: విశాఖలో ముగ్గురు ఇంటర్ విద్యార్థుల మిస్సింగ్ కలకలం సృష్టిస్తోంది.. గాజువాకలోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు అదృశ్యం అయ్యారు.. ఈ నెల 24వ తేదీన కే. కోటపాడు వెళ్లారు ముగ్గురు విద్యార్థులు.. కే.కోటపాడు నుంచి తిరుగు పయనం అయినప్పటికీ.. తిరిగి ఇంటికి చేరుకోలేదు.. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు.. ముగ్గురికి ముగ్గురు విద్యార్థులు కనిపించకుండా పోయారు.. దీంతో.. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు.. ఈ విషయానికి పోలీసులకు చేరవేశారు.. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన గాజువాక పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు..

Read Also: Bihar : విద్యార్థిని దారుణంగా కొట్టిన టీచర్లు.. ప్రైవేట్ భాగాల్లో రక్తస్రావమై..

ఇక, గాజువాక పోలీసుల సమాచారం మేరకు కే.కోటపాడు పోలీసులు సైతం గాలింపు చర్యలు చేపట్టారు.. అయినా ఇప్పటి వరకు విద్యార్థుల ఆచూకీ లభ్యం కాలేదు.. తప్పిపోయిన విద్యార్థులు ఉమేష్ పవన్ (16), పిల్లల దిలీప్ (16), దంతేశ్వరి (16)గా గుర్తించారు.. వీరు ముగ్గురూ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. విద్యార్థులు కనిపించకుండా పోవడం వెనుక కారణాలు ఏంటి? అనేది ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి.. ఉద్దేశ్యపూర్వకంగానే ముగ్గురూ కలిసి వెళ్లారా? ఎవరైనా కిడ్నాప్‌ చేశారా? ఇంకా ఏదైనా ప్రమాదం జరిగిందా? ఇలా పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, ఈ మధ్యే విశాఖలో కిడ్నాప్‌ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం విదితమే.. ఈ తరుణంలో ఆ ముగ్గురు విద్యార్థులు ఎటుపోయారు అనేది ఆస్తికరంగా మారిపోయింది.

Show comments