Infinix Hot 50 5G: కేవలం రూ.10000కే అద్భుతమైన ఫీచర్లతో మొబైల్..
- కేవలం రూ.10000కే అద్భుతమైన ఫీచర్లతో మొబైల్.
- 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ రూ.9999
- 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ రూ.10,999 లకు అందుబాటులో.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Infinix Hot 50 5G: ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్‌లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌లకు మంచి క్రేజ్ ఉంది. అనేక స్మార్ట్‌ఫోన్ కంపెనీలు రూ.10,000 ధర సెగ్మెంట్‌లో అధిక ఫీచర్లతో ఫోన్లు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ (Infinix) గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో హాట్ 50 5G స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేసింది. ఆకట్టుకునే డిజైన్, మోడరన్ ఫీచర్లతో ఇది వినియోగదారులను ఆకర్షిస్తోంది. అంతేకాదండోయ్.. ప్రస్తుతం ఈ ఫోన్ డిస్కౌంట్ ధరకు లభ్యమవుతోంది. ఇప్పుడు ఈ ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు, ధరల వివరాలు వివరంగా తెలుసుకుందాం.
Also Read: IPL 2025: ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్ ఆ టీమ్స్ మధ్యనే.. ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్ ఎప్పుడంటే?
Also Read
ఈ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ రూ.9,999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ రూ.10,999 లకు అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్స్ పై ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) లో ఈ ఫోన్ రూ.9,499కే అందుబాటులో ఉంది. అంటే సుమారు రూ.500 తగ్గింపును పొందవచ్చు. అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉపయోగిస్తే 5% క్యాష్ బ్యాక్ పొందవచ్చు. పలు బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.1,200 తగ్గింపు కూడా లభిస్తుంది.
ఇన్ఫినిక్స్ హాట్ 50 5G ఫీచర్లు & స్పెసిఫికేషన్‌ల విషయానికి వస్తే.. ఈ ఫోన్ ఆకర్షణీయమైన 6.7 అంగుళాల (1600 x 720 పిక్సల్స్) HD+ LCD డిస్‌ప్లే తో అందుబాటులో ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్ డిస్‌ప్లే స్క్రోల్ చేయడాన్ని స్మూత్‌గా మారుస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 SoC ప్రాసెసర్ తో పనిచేస్తోంది. Mail G57 MC2 GPU తో మెరుగైన గ్రాఫిక్స్ అనుభవం అందిస్తుంది. ఇది 8GB LPDDR4X ర్యామ్, 128GB UFS 2.2 స్టోరేజీ కలిగి ఉంది. ఫోన్ స్టోరేజీని 1TB వరకు పెంచుకోవడానికి మైక్రో SD కార్డు సపోర్ట్ ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత XOS 14.5 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఇది పని చేస్తోంది. ఇన్ఫినిక్స్ హాట్ 50 5000mAh భారీ బ్యాటరీతో వస్తోంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. దీంతో బ్యాటరీ త్వరగా ఛార్జ్ అవుతుంది.
Also Read: Aadhaar Card Safe: ఆధార్ కార్డు దుర్వినియోగం అవుతుందని అనుమానమా? అయితే ఇలా చెక్ చేసుకోండి
ఇక కెమెరా ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 48MP సోనీ IMX582 ప్రైమరీ కెమెరా, AI డెప్త్ సెన్సార్, LED ఫ్లాష్ లైట్ లతోపాటు.. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఫోటోగ్రఫీ ప్రేమికులకు ఇది చక్కటి అనుభూతిని అందిస్తుంది. వీటితోపాటు IP54 రేటింగ్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 5G, 4G LTE, బ్లూటూత్ 5.4, Wi-Fi 802.11, GPS కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. వైబ్రంట్ బ్లూ, స్లీక్ బ్లాక్, సేజ్ గ్రీన్ కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంది.
ఇన్ఫినిక్స్ హాట్ 50 5G స్మార్ట్‌ఫోన్ చవక ధరలో అధిక ఫీచర్లు అందించడంతో వినియోగదారులకు మంచి ఎంపికగా నిలుస్తోంది. ప్రత్యేకించి ప్రీమియం డిజైన్, 120Hz డిస్‌ప్లే, 48MP కెమెరా, 5G కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఈ ధరలో బహుశా ఇతర ఫోన్లలో లభించవు. ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లతో మరింత తక్కువ ధరకే పొందవచ్చు. కాబట్టి ఎంట్రీ లెవల్ 5G ఫోన్ కోసం చూస్తున్నవారికి ఇది బాగా సరిపోతుంది.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!