Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Indw Vs Irew 1st Odi Preview And Playing 11

INDW vs IREW: ఐర్లాండ్‌తో భారత్‌ తొలి వన్డే.. జోరు కొనసాగేనా!

Published Date :January 10, 2025 , 8:37 am
By Sampath Kumar
  • మరో సమరానికి సిద్ధమైన భారత్‌
  • ఐర్లాండ్‌తో భారత్‌ తొలి వన్డే
  • ఇప్పటిదాకా ఆడిన 12 వన్డేలలో విజయాలే
INDW vs IREW: ఐర్లాండ్‌తో భారత్‌ తొలి వన్డే.. జోరు కొనసాగేనా!
  • Follow Us :
  • google news
  • dailyhunt

సొంతగడ్డపై వెస్టిండీస్‌ను వన్డే సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌ చేసిన భారత మహిళల జట్టు మరో సమరానికి సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం ఐర్లాండ్‌తో భారత్ తొలి మ్యాచ్‌ ఆడనుంది. రెగ్యులర్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌కు సెలెక్టర్లు విశ్రాంతిని ఇచ్చారు. దాంతో ఈ సిరీస్‌కు స్మృతి మంధాన కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. వెస్టిండీస్‌తో సిరీస్‌లో బ్యాటర్‌గా అదరగొట్టిన స్మృతి.. ఇప్పుడు కెప్టెన్‌గానూ రాణించాల్సిన అవసరం ఉంది. రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఉదయం 11 నుంచి మ్యాచ్ ఆరంభం కానుంది.

వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లలో స్మృతి మంధాన వరుసగా అయిదు అర్ధ సెంచరీలు చేసిన విషయం తెలిసిందే. ఐర్లాండ్‌పై కూడా అదే జోరు కొనసాగించాలని మేనేజ్మెంట్ కోరుకుంటోంది. హర్లీన్‌ డియోల్, ప్రతీక రావల్, జెమీమా రోడ్రిగ్స్‌ పరుగులు చేస్తుండడం కలిసొచ్చే అంశం. ఈ సిరీస్‌కు పేసర్‌ రేణుక సింగ్‌ దూరమయ్యారు. దాంతో తితాస్‌ సాధు, సైమాలు బౌలింగ్ భారాన్ని మోయనున్నారు. ఆల్‌రౌండర్‌ దీప్తిశర్మ రాణించడం కీలకం. ఐర్లాండ్‌తో టీమిండియాకు మంచి రికార్డు ఉంది. ఇప్పటిదాకా ఆడిన 12 వన్డేలలో భారత్‌ అన్ని గెలిచింది.

మీడియా సమావేశంలో కెప్టెన్‌ స్మృతి మంధాన మాట్లాడుతూ… ‘ఓపెనర్ షెఫాలీ వర్మకు గత రెండు సిరీస్‌లలో జట్టులో స్థానం దక్కలేదు. షెఫాలీ స్థానంలో జట్టులోకి వచ్చిన ప్రతీక రావల్‌ బాగా ఆడుతోంది. వచ్చిన అవకాశాన్ని బాగా సద్వినియోగం చేసుకుంది. షెఫాలీ దేశవాళీలో సత్తా చాటి తిరిగి జట్టులోకి వస్తుందని భావిస్తున్నాం. జట్టు ప్రణాళికల్లో ఆమె ఉంది. కెప్టెన్సీని ఎంజాయ్ చేస్తా. ఐర్లాండ్‌పై గెలిచేందుకు ప్రయత్నిస్తాం’ అని తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • India women
  • INDW vs IREW
  • INDW vs IREW 1st ODI
  • Ireland Women
  • smriti mandhana

తాజావార్తలు

  • PAKISTAN: ప్రపంచానికి మధ్యవర్తిగా బిల్డప్.. కానీ హోటల్ బిల్లులు కట్టలేని పరిస్థితి!

  • VF MPV 7: విన్‌ఫాస్ట్ VF MPV 7 వచ్చేస్తోంది.. 500KM రేంజ్, 7 సీట్లు, ధర ఎంత? పూర్తి సమాచారం

  • TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ ‘‘కార్పొరేట్ జిహాద్’’ కేసులో సంచలన విషయాలు..!

  • KKR Vs CSK: కేకేఆర్ టార్గెట్ 193.. మరోసారి కీలక పాత్ర పోషించిన సంజూ..

  • Job Racket: యూరప్ వెళ్లాలనుకున్న నిరుద్యోగులు.. చివరకు చేరింది ఎక్కడికో తెలుసా..?

ట్రెండింగ్‌

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • మిలిటరీ స్టాండర్డ్ డ్యూరబిలిటీ + పవర్ ప్యాక్ ఫీచర్లు.. OPPO A6s Pro లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions