Minister Seethakka : సర్వే జరిగిన భూములకు హక్కులు కల్పిస్తాం.. అది మా బాధ్యత..
- ఇంద్రవెల్లి ఘటనపై బాధ్యతను తీసుకున్న ప్రభుత్వం
- అమరవీరుల స్మృతి వనం ప్రారంభానికి సిద్ధం
- ఆదివాసుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు : మంత్రి సీతక్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Seethakka : ఇంద్రవెల్లి సంఘటన జ్ఞాపకార్థం నిర్వహించిన సభలో ఆదివాసుల హక్కుల కోసం మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. “అనాటి ఘటన దురదృష్టకరమైనది. అది ఎవరి వైపు నుంచైనా తప్పుగా జరిగి ఉండొచ్చు, కానీ బాధ్యతను మేమే తీసుకుంటాం” అంటూ ఆమె పేర్కొన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ, అప్పట్లో రెవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఇంద్రవెల్లి అమరవీరుల జ్ఞాపకార్థం స్మృతివనం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. “అప్పుడు నివాళులర్పించడానికి కూడా అనుమతి ఇవ్వలేదు. నిషేధాలు విధించబడ్డాయి. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా ఇంద్రవెల్లి సంఘటనను ‘సంస్కరణ దినం’గా నిర్వహిస్తోంది,” అని తెలిపారు.
అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించేందుకు విద్యార్హతల ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. ట్రైబల్ వేల్ఫేర్ డిపార్ట్మెంట్ (ITDA) ద్వారా ట్రాక్టర్లు, ఇతర వాహనాలను పంపిణీ చేశామని చెప్పారు. సంఘటనలో మరణించిన వారి పూర్తి వివరాలను సేకరించేందుకు ప్రత్యేక కమిటీ వేయనున్నట్లు ప్రకటించారు.
Also Read
- Bagara Rice: దావత్ స్టైల్ 'బగారా రైస్' ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
- Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
- Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
- Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
మంత్రి సీతక్క మాట్లాడుతూ, “కాకతీయులకు వ్యతిరేకంగా సమ్మక్క–సారలమ్మలు పోరాడారు. నిజాం హయాంలో కొమరం భీమ్, అలాగే ఇంద్రవెల్లి వీరులా అందరూ జాతి ప్రయోజనాల కోసం తమ ప్రాణాలు అర్పించారు,” అని గుర్తు చేశారు. సమ్మక్క–సారక్క జాతరను ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. “గత ప్రభుత్వం ఐటిడిఎలను నిర్వీర్యం చేసింది. మేము తిరిగి వాటికి ప్రాణం పోస్తున్నాం. త్వరలో ఐటిడిఎల మీటింగ్ నిర్వహిస్తాం. జీవో నెంబర్ 3పై మేధావులతో చర్చిస్తాం,” అన్నారు.
మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల ద్వారా ఆర్థికసాయం చేస్తున్నామని, పీఎం మోడీ కూడా “ఇప్ప పువ్వు లడ్డు”పై ప్రశంసలు తెలిపారన్నారు. సాగుచేసుకుంటున్న భూములకు హక్కుల పత్రాలు ఇవ్వడం ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. సర్వే పూర్తైన భూములకు హక్కులు కల్పిస్తామని, కానీ కొత్తగా అడవిని నరికేలా చేయరని చెప్పారు.
ఆగస్ట్ 9న అమరవీరుల స్మృతివనం ప్రారంభం: “ఇంద్రవెల్లి అమరవీర్లకు అంకితంగా నిర్మిస్తున్న స్మృతివనాన్ని ఆగస్ట్ 9న ప్రారంభిస్తాం. ఇందులో ఎవరి ఫోటోలు పెట్టాలన్న దానిపై ఒక నిర్ణయం తీసుకుంటాం,” అని సీతక్క వివరించారు. “ఫారెస్ట్ అధికారులు సంయమనం పాటించాలి. రైతులు ఉన్న భూమిని సద్వినియోగం చేసుకుంటూ బోర్లు వేసుకుని రెండు పంటలు దిగాలన్నదే మా ఉద్దేశం,” అన్నారు.
Health Tips: ఒత్తిడితో సతమతమవుతున్నారా? ఈ ఫుడ్స్ ను డైట్ లో చేర్చుకోండి!
తాజావార్తలు
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
-
Indian Cinema: ‘బాహుబలి 2’ను కూడా వెనక్కి నెట్టిన పాత సినిమా.. 12 కోట్లకు పైగా టికెట్లు అమ్మి సరికొత్త రికార్డ్!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Project Cheetah Success: భారత్‌లో పెరిగిన చీతాల సంఖ్య.. 56కి చేరిక.. పర్యావరణానికి ఎందుకు కీలకం?
ట్రెండింగ్
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..