NTV Telugu Site icon

Indrakaran Reddy: కంటి వెలుగు విజయవంతం చేయాలి

Indrakaran Reddy

Indrakaran Reddy

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లా అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేయాల‌న్నారు మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి. మంచిర్యాలలో కంటి వెలుగుపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమావేశం నిర్వహించారు. సామూహిక కంటి ప‌రీక్షల ద్వారా ప్రజ‌ల్లో నేత్ర స‌మ‌స్యల‌ను ప‌రిష్కరించే ల‌క్ష్యంతో సీయం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమం తీసుకొచ్చారన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ప్రతి ఒక్కరికీ కంటి ప‌రీక్షలు నిర్వహించాల‌నే ఉద్దేశ్యంతో ప్రణాళిక‌లు రూపొందించి అమ‌లు చేస్తున్నారు.

ఈ నెల 12లోగా మండల పరిషత్‌, మున్సిపాలిటీల్లో సమావేశాలు పూర్తిచేయాలన్నారు. 18న నియోజక‌వర్గాలలో ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆదేశించారు. జూన్‌ నెలాఖరులోగా అందరికీ పరీక్షలు చేయాలని, అవసరమైనవారికి మందులు, కంటి అద్దాలు అందజేయాలని నిర్దేశించారు. కంటి వెలుగు క్యాంపులపై ప్రజ‌ల్లో అవ‌గాహ‌న పెంచేందుకు, కార్యక్రమం స‌క్సెస్ అయ్యేలా క్షేత్రస్థాయిలో ఊరు, వాడల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని సూచించారు.

Read Also: Balka Suman: మన పథకాల వైపు దేశం చూస్తోంది

అవసరమైన వారికి మందులు, కళ్లద్దాలు పంపిణీ చేయాలని, ప్రజా ప్రతినిధులు, అధికారులందరు భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని జిల్లాలో నూటికి నూరు శాతం విజయవంతం చేసేందుకు అంకిత భావంతో కృషి చేయాల‌ని కోరారు. ఈ స‌మావేశంలో ప్రభుత్వ విప్ బాల్క సుమ‌న్, జిల్లా పరిషత్ చైర్ ప‌ర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యేలు దివాక‌ర్ రావు, దుర్గం చిన్నయ్య, క‌లెక్టర్ భార‌తీ హోళీకేరి డీఎంహెచ్ ఓ, మున్సిపల్ చైర్ పర్సన్లు, ఇత‌ర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Read Also: Ponguleti Srinivasa Reddy: ప్రజలు ఏం కోరుకుంటున్నారో రాబోయే కురుక్షేత్రంలో నెరవేరుస్తా..