NTV Telugu Site icon

G20 Presidency to India: అధికారికంగా భారత్‎కు జీ20 అధ్యక్ష పగ్గాలు.. బాధ్యతలు అందుకున్న మోదీ

Pm Modi At G20

Pm Modi At G20

G20 Presidency to India: ఇండోనేషియాలోని బాలిలో జరుగుతున్న జీ20 సదస్సు రెండు రోజులుగా కొనసాగుతోంది. వచ్చే ఏడాది జీ20 శిఖరాగ్ర సదస్సుకు భారత్ అధ్యక్ష వహించనున్నట్లు స్పష్టమైంది. సమావేశాల్లో భాగంగా జీ20 దేశాల అధ్యక్ష బాధ్యతలను ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో నుంచి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అందుకున్నారు. ప్రస్తుత జీ 20 సమావేశాల ముగింపు కార్యక్రమం ఈ రోజు జరిగింది. జీ-20 అధ్యక్ష బాధ్యతలను భారత్ అధికారికంగా వచ్చే నెల 1 నుంచి చేపట్టనుంది. ఏడాది పాటు (డిసెంబర్ 1 నుంచి 2023 నవంబర్ 20 దాకా) భారత్ జీ20 అధ్యక్ష స్థానంలో కొనసాగనుంది. వచ్చే ఏడాది భారత్ లోనే జీ20 శిఖరాగ్ర సదస్సు జరగనుంది.

Read Also: Big Shock to Congress: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి గట్టిదెబ్బ.. పార్టీ మారనున్న సీనియర్ నేత?

బాలిలో జరుగుతున్న జీ20 సదస్సులో భాగంగా బుధవారం సభ్య దేశాల అధినేతలు, ఆయా దేశాల ప్రతినిధి బృందాల కరతాళ ధ్వనుల మధ్య జోకో విడోడో నుంచి ప్రధాని మోదీ జీ20 అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. జీ20 అధ్యక్ష బాధ్యతలు ప్రతి భారతీయుడికి దక్కిన గౌరవంగా ఆయన అభివర్ణించారు. వచ్చే ఏడాది భారత్ లో జరగనున్న సదస్సులను దేశంలోని వివిధ నగరాల్లో నిర్వహిస్తామని కూడా మోదీ చెప్పుకొచ్చారు. ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’అనే నినాదంతో, వసుధైక కుటుంబం అనే భావనతో 2023లో జీ20 సదస్సును నిర్వహిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. జీ20 అధ్యక్ష పదవిని చేపట్టడం ప్రతి భారతీయుడికి గొప్ప గర్వకారణమని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ప్రపంచ మార్పునకు ఉత్ప్రేరకంగా జీ20 సదస్సును మారుస్తామని ప్రధాని హామీనిచ్చారు. ఇప్పటికే జీ20 సదస్సుకు సంబంధించిన పనులను భారత్ ప్రారంభించింది. వచ్చే ఏడాది నిర్వహించనున్న సమావేశాల కోసం వెబ్​సైట్, లోగోను కూడా ఇప్పటికే ఆవిష్కరించింది.

Show comments