IndiGo Flight Emergency Landing: ఇండిగో విమానంకు తప్పిన పెను ప్రమాదం.. టేకాఫ్ అయిన 3 నిమిషాలకే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IndiGo Flight makes Emergency Landing in Patna due to Engine Fail: దేశీయ విమానయాన సంస్థ ‘ఇండిగో’కు చెందిన ఓ విమానంకు పెను ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపం కారణంగా టేకాఫ్ అయిన 3 నిమిషాలకే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ఈ ఘటన శుక్రవారం ఉదయం పట్నా విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఇంజిన్ వైఫల్యం కారణంగానే.. విమానం టేకాఫ్ అయిన మూడు నిమిషాలకే అత్యవసరంగా దించేశారు. దాంతో ఇండిగో విమానంలో ఉన్న వారు పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు.
అధికారుల వివరాల ప్రకారం… పట్నాలోని జయప్రకాశ్ నారాయణ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈరోజు ఉదయం ఇండిగో 6ఈ 2433 నంబర్ విమానం ఢిల్లీకి బయల్దేరింది. టేకాఫ్ అయిన 3 నిమిషాలకే విమానంలోని ఒక ఇంజిన్ పని చేయలేదు. ఇది గమనించిన పైలట్.. వెంటనే ఏటీసీకి సమాచారం ఇచ్చాడు. అప్రమత్తమైన ఏటీసీ అధికారులు విమానాన్ని అత్యవసరంగా (ఎమర్జెన్సీ ల్యాండింగ్) దించేశారు. ఉదయం 9.11 గంటలకు విమానం ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ అయింది. దాంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.
Also Read
ప్రస్తుతం పట్నాలోని జయప్రకాశ్ నారాయణ్ ఎయిర్‌పోర్టులో కార్యకలాపాలన్నీ సజావుగానే సాగుతున్నాయని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ప్రయాణికులను మరో విమానంలో ఢిల్లీ పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జులైలో కూడా ఓ ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన గంటకు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. టైర్ పేలి ఉంటుందన్న అనుమానంతో ప్యారిస్ బయల్దేరిన విమానాన్ని వెనక్కి మళ్లించి.. ఢిల్లీలో అత్యవసరంగా దించేశారు.
Also Read: Donation Astro Tips: పొరపాటున కూడా ఈ వస్తువులను దానం చేయకూడదు.. చేశారో దురదృష్టం ఇక మీ వెంటే!
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!