DA Hike: ఉద్యోగులు, పెన్షన్‌దారులకు శుభవార్త.. రేపే డీఏ పెంపు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దీపావళి పండుగ వేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు ఎంతగానో ఎదురుచూస్తున్న వార్త త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. డీఏ పెంపునకు సంబంధించి అక్టోబర్ 28న జరిగే కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉద్యోగులకు 60 శాతంగా ఉన్న డీఏను మరో 3 శాతం పెంచి 63 శాతానికి చేర్చే యోచనలో ప్రభుత్వం ఉంది. ఒకవేళ ఈ పెంపునకు కేబినెట్ ఆమోదం లభిస్తే.. జూలై 2026 నుంచే ఈ పెరిగిన అలవెన్స్ అమల్లోకి వస్తుంది. దీనివల్ల ఉద్యోగులకు జూలై నుంచి అక్టోబర్ వరకు ఉన్న నాలుగు నెలల బకాయిలు నవంబర్ నెలాఖరు జీతంతో కలిపి వచ్చే అవకాశం ఉంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.
అక్టోబర్ తొలి వారంలోనే ఈ డీఏ పెంపుపై ప్రకటన వస్తుందని ఉద్యోగులు భావించినప్పటికీ, ప్రభుత్వం దసరా, దీపావళి కానుకగా రైల్వే, ఇతర కేంద్ర ఉద్యోగులకు బోనస్‌లు ప్రకటించింది కానీ డీఏపై నిర్ణయం తీసుకోలేదు. తాజాగా ఆల్ ఇండియా న్యూ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వర్గాల సమాచారం ప్రకారం అక్టోబర్ 28న జరిగే సమావేశం తర్వాతే ప్రభుత్వం ఈ పెంపును అధికారికంగా వెల్లడించే చాన్స్ ఉంది. జూలై 2025 నుంచి జూన్ 2026 వరకు నమోదైన సగటు వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా ఈ 3 శాతం పెంపును ఖరారు చేశారు.
Also Read
- Shehbaz Sharif: 2050 నాటికి ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పాకిస్థాన్.. అప్పుల ఊబిలో ఉన్నా భారీ లక్ష్యం!
- Under -19 Asia Cup: టెయిలెండర్ల అద్భుతం.. పాకిస్థాన్‌ను చిత్తు చేసి ఆసియా కప్ కొట్టేసిన భారత్..
- Rahul Gandhi : ఫాసిస్టు శక్తులను తరిమికొడతాం.. హైదరాబాద్ వేదికగా రాహుల్ గాంధీ పిలుపు
- Vigilance Raids: అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌పై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం.. రూ. 10.43 కోట్ల సరుకు స్వాధీనం..
ఈ డీఏ పెంపు వల్ల ఉద్యోగుల నెలవారీ వేతనాల్లో చెప్పుకోదగ్గ మార్పు రానుంది. డీఏ అనేది ప్రతి ఉద్యోగి ప్రాథమిక వేతనం ఆధారంగా లెక్కించబడుతుంది. అంతేకాకుండా.. పెద్ద నగరాల్లో పనిచేసే ఉద్యోగుల రవాణా అలవెన్స్ కూడా దీనికి అనుగుణంగా పెరుగుతుంది. ఉదాహరణకు.. రూ. 47,600 బేసిక్ పే ఉన్న లెవెల్-8 ఉద్యోగికి 3 శాతం డీఏ పెంపు వల్ల నెలకు సుమారు రూ. 1,428 అదనంగా అందుతాయి. దీనికి తోడు రవాణా అలవెన్స్‌లో మరో రూ. 108 పెరిగి, మొత్తంగా నెలకు మంచి వేతన పెరుగుదల లభిస్తుంది. పండుగల సీజన్లో ప్రభుత్వం తీసుకోబోయే ఈ నిర్ణయం లక్షలాది మంది కేంద్ర ఉద్యోగులు, పింఛనుదారుల కుటుంబాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపనుంది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-1 Live: కైలాసాన్ని తలపించే వేదిక.. కోటి దీపోత్సవంలో తొలిరోజు విశేషాలివే.!
-
Shehbaz Sharif: 2050 నాటికి ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పాకిస్థాన్.. అప్పుల ఊబిలో ఉన్నా భారీ లక్ష్యం!
-
Itlu Arjun సక్సెస్ క్రెడిట్ నాది కాదు.. ఆ హార్డ్ వర్క్ అంతా వారిదే: నాగార్జున
-
Giribabu Death:బాధతో మాటలు రావడం లేదు’.. గిరిబాబు మృతిపై మోహన్ బాబు ఎమోషనల్!
-
Nagarjuna: నా ట్రాక్ రికార్డ్ చూడండి ఫ్లాప్ అయితే కాలేదు.. సినిమా ప్రెజెంటేషన్‌పై నాగార్జున బోల్డ్ కామెంట్స్!
-
Divija: తమిళ్ సినిమాలో హీరోయిన్ గా ఈటీవీ ప్రభాకర్ కూతురు
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!