Indigo Flight Emergency: కోల్‌కతా నుంచి బుధవారం ఇండిగో విమానం 6E-6961 శ్రీనగర్‌కు వెళ్తుంది. ఇదే సమయంలో ఊహించని ప్రమాదానికి విమానం గురైంది. గాల్లో 166 మంది ప్రయాణికుల ప్రాణాలు ఉన్నాయి. వెంటనే ఫైలట్ చాకచక్యంగా ప్రమాదం నుంచి ప్రయాణికులను బయట పడేశాడు. వాస్తవానికి ఈ విమానంలో ఇంధన లీక్ సమస్యను గుర్తించిన వెంటనే ఫైలట్లు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
READ ALSO: Minister Vanitha: మాజీ సీఎంపై మంత్రి సంచలన ఆరోపణలు..!
ప్రయాణికులందరూ క్షేమం..
విమానంలోని 166 మంది ప్రయాణికులు, సిబ్బందిని సురక్షితంగా తరలించినట్లు అధికారులు చెప్పారు. ఈ సంఘటనపై విమానాశ్రయ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వారణాసి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పరిస్థితి అదుపులో ఉందని, సాధారణ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయని వెల్లడించారు. ఈ సంఘటనకు సంబంధించి సంస్థ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ సంఘటనకు ముందు ఇండిగో అక్టోబర్ 26 నుంచి ఢిల్లీ విమానాశ్రయంలోని మూడు టెర్మినల్స్ నుంచి విమానాలను నడుపుతున్నట్లు ప్రకటించింది.
ఈ విమానాశ్రయం నుంచి అన్ని అంతర్జాతీయ విమానాలు టెర్మినల్-3 నుంచి నడుస్తాయి. టెర్మినల్ 2 నుంచి 6E 2000 – 6E 2999 నంబర్ విమానాలను, టెర్మినల్ 3 నుంచి 6E 5000 – 6E 5999 నంబర్ విమానాలను, అన్ని అంతర్జాతీయ విమానాలకు నడుపుతామని ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదే సమయంలో సంస్థకు సంబంధించిన అన్ని దేశీయ విమానాలు టెర్మినల్ 1 నుంచి నడుస్తూనే ఉంటాయని చెప్పింది. ఇండిగో IGI విమానాశ్రయం నుంచి వారానికి సుమారు 1,700 విమానాలను నడుపుతుంది. ఈ సంస్థ ప్రతిరోజూ 2,200 కంటే ఎక్కువ విమానాలను నడుపుతుంది.
READ ALSO: China GJ-X Drone: డ్రాగన్ దేశంలో కొత్త స్టెల్త్ డ్రోన్.. నెక్స్ట్ జనరేషన్ బాంబర్ కాదు కదా?