Railway Budget: రైల్వే మొదటి బడ్జెట్ ఎంత ? ప్రస్తుతం వందేభారత్ కు ఎంత ఖర్చవుతుందంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Railway Budget: మోడీ ప్రభుత్వం తన రెండవ టర్మ్ చివరి బడ్జెట్‌ను ఫిబ్రవరి 1, 2024న సమర్పించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ బడ్జెట్ పూర్తి బడ్జెట్ కాదు. ఎందుకంటే ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ముందు ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. దేశ చరిత్రలో సాధారణ బడ్జెట్‌కు ఒక రోజు ముందు రైల్వే బడ్జెట్‌ను సమర్పించే సంప్రదాయం ఉంది, దీనిని 2017 లో మోడీ ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తర్వాత రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో విలీనం చేశారు. మధ్యంతర బడ్జెట్‌లో కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. అంటే ఈసారి మధ్యంతర బడ్జెట్ లోనే రైల్వే బడ్జెట్ కూడా ప్రవేశపెట్టనున్నారు. గతేడాది రైల్వేకు ప్రభుత్వం రూ.2.4 లక్షల కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. ఇది భారతదేశపు మొదటి రైల్వే బడ్జెట్ కంటే అనేక వేల రెట్లు ఎక్కువ. స్వాతంత్య్రానంతరం ప్రవేశపెట్టిన తొలి రైల్వే బడ్జెట్ గురించి తెలుసుకుందాం.
తొలి రైల్వే బడ్జెట్ ఎంత పెద్దది?
భారతీయ రైల్వే మొదటి బడ్జెట్ 1947-48లో సమర్పించబడింది. ఇది రూ. 183 కోట్లు. ఈరోజు వందేభారత్ రైలును సిద్ధం చేయడానికే దాదాపు రూ.115 కోట్లు ఖర్చవుతుంది. రెండు వందేభారత్‌ల ఖర్చు కలిపితే, మొత్తం రూ. 230 కోట్లు అవుతుంది. ఇది మొదటిసారిగా సమర్పించిన రైల్వే మొత్తం బడ్జెట్ కంటే రూ.47 కోట్లు ఎక్కువ. అంటే ఆ బడ్జెట్‌లో ఒక్క వందే భారత్ రైలు మాత్రమే సిద్ధం అవుతుంది. 1947 నవంబర్ 26న అప్పటి భారత రైల్వే, రవాణా శాఖ మంత్రి జాన్ మథాయ్ స్వతంత్ర భారతదేశానికి మొదటి రైల్వే బడ్జెట్‌ను సమర్పించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆయన మూడు నెలల తర్వాత 24 ఫిబ్రవరి 1948న రెండవ పూర్తి రైల్వే బడ్జెట్‌ను సమర్పించాడు.
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
Read Also:Postal Jobs 2024 : పది అర్హతతో భారీగా ఉద్యోగాలు.. నెలకు జీతం ఎంతంటే?
జగ్జీవన్ రామ్ అత్యధికంగా ఏడుసార్లు రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2023-24 సంవత్సరానికి రైల్వే బడ్జెట్ రూ.2.4 లక్షల కోట్లు. ఇది 2013-14 బడ్జెట్ కంటే దాదాపు తొమ్మిది రెట్లు ఎక్కువ. ఈసారి పెరుగుదల కనిపించవచ్చు. 2016లో రైల్వే బడ్జెట్ పరిమాణం మొత్తం బడ్జెట్‌లో దాదాపు 15శాతం అని చెప్పారు. అందుకే దీన్ని సాధారణ బడ్జెట్‌లో విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. 2017 ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో తొలి ఉమ్మడి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆ ఏడాది అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దేశ సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
ఇప్పుడు పేపర్‌లెస్ బడ్జెట్
1955 సంవత్సరం వరకు బడ్జెట్‌ను ఆంగ్లంలో మాత్రమే సమర్పించేవారని, అయితే ఆ సంవత్సరం నుండి కాంగ్రెస్ ప్రభుత్వం దానిని ఇంగ్లీషు, హిందీ భాషలలో ప్రవేశపెట్టడం ప్రారంభించిందది. 1999 వరకు బడ్జెట్ ప్రసంగాన్ని ఫిబ్రవరి చివరి పనిదినం రోజున సాయంత్రం 5 గంటలకు సమర్పించారు, అయితే యశ్వంత్ సిన్హా 1999లో ఉదయం 11 గంటలకు సమర్పించారు. 2017లో బడ్జెట్‌లో రెండు ప్రధాన మార్పులు జరిగాయి. మొదటిది, రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌తో విలీనం చేయడం, రెండవ ప్రధాన మార్పు నెల చివరి రోజు ఫిబ్రవరి 1వ తేదీన సమర్పించడం. ఇది మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వం 2021-22 బడ్జెట్‌ను మొదటిసారిగా డిజిటల్‌గా సమర్పించింది.
Read Also:IND vs AFG: కోహ్లీ, రోహిత్ వచ్చేశారు.. అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ఇదే!
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!