అమెరికా నుంచి భారతదేశానికి అక్రమ వలసదారులు తిరిగి వచ్చారు. 104 మంది భారతీయులు పంజాబ్‌లోని శ్రీ గురు రామ్‌దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను తిరిగి పంపుతున్న తీరుపై గురువారం ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రయాణం అంతా చేతులకు, కాళ్లకు బేడీలు వేశారని, అమృత్‌సర్ విమానాశ్రయంలో దిగిన తర్వాతే తీసినట్లు బహిష్కరణకు గురైన వారు తెలిపారని రాజ్యసభలో ప్రస్తావించారు.
READ MORE: Central Election Commission: సీఆర్డీఏ లేఖకు ఈసీ సమాధానం.. అభ్యంతరం లేదు.. కానీ, ఎన్నికల తర్వాతే..
దీనితో ఓ భారతీయుడి చేతికి సంకెళ్లు వేసి వెనక్కి పంపించారని సోషల్ మీడియాలో పుకార్లు మొదలయ్యాయి. భారతీయులను చేతులకు, కాళ్లకు సంకెళ్లు వేసి పంపారని ఒక సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతోంది. 200 మందికి పైగా భారతీయులను అమానుషంగా బహిష్కరించారని మరో పోస్ట్‌లో పేర్కొన్నారు. అక్రమ వలసదారులైన భారతీయుల చేతులకు సంకెళ్లు ఉన్నాయని.. వారిని నేరస్థులలాగా చూశారని, కనీసం సుదీర్ఘ ప్రయాణంలో విమానాల్లో టాయిలెట్‌ని ఉపయోగించడానికి అనుమతి లేదని పుకార్లు సికార్లు కొడుతున్నాయి. ‘డాక్టర్ ఎస్ జైశంకర్, మోడీ ప్రభుత్వం భారతీయ పౌరులను గౌరవప్రదంగా మన దేశానికి తీసుకొచ్చేలా ఏర్పాటు చేయలేదా?’ అనే ప్రశ్నలు సైతం వచ్చాయి. ఈ అంశంపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పందించింది. ఈ ఫొటోలు భారతీయులకు చెందినవి కాదని కొట్టిపారేసింంది. “అక్రమ భారతీయ వలసదారులను అమెరికా నుంచి భారత్‌కు పంపినప్పుడు వారి చేతులు, కాళ్లకు సంకెళ్లు, గొలుసులు వేయలేదు. ఈ పోస్ట్‌లలో షేర్ అవుతున్న చిత్రాలు భారతీయులవి కావు. గ్వాటెమాలాకు పంపిన వారివి.” అని పీఐబీ పేర్కొంది.
READ MORE:Maha Kumbh Mela: కుంభమేళాలో మరో ప్రమాదం.. కారు డివైడర్‌ను ఢీకొని 8 మంది మృతి