NTV Telugu Site icon

Thailand: భారతీయులకు గుడ్‌న్యూస్‌.. వీసా లేకుండానే థాయ్‌లాండ్‌కు ప్రయాణించవచ్చు..

Thailand

Thailand

Thailand: ప్రయాణికులను ఆకర్షించేందుకు థాయ్ ప్రభుత్వం వీసా రహిత ప్రవేశ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఆగ్నేయాసియా దేశం టూరిజంను పెంచాలని చూస్తున్నందున భారతీయులు నవంబర్ 10 నుంచి మే 10, 2024 వరకు వీసా లేకుండా థాయ్‌లాండ్‌కు వెళ్లవచ్చు. థాయ్‌లాండ్‌కు ప్రధాన పర్యాటక వనరులలో భారతదేశం ఒకటి.

Also Read: Cash For Query: బీజేపీ వద్ద ఆధారాల్లేవ్.. లోక్‌సభ ఎథిక్స్ కమిటీ ముందు హాజరుకానున్న టీఎంసీ ఎంపీ

నవంబర్ 10, 2023 నుంచి మే 10, 2024 వరకు భారతీయులు వీసా లేకుండా థాయ్‌లాండ్‌కు ప్రయాణించవచ్చు. ఒక ప్రవేశంపై ఒక వ్యక్తి 30 రోజుల వరకు ఉండగలరు. థాయ్‌లాండ్ భారతదేశంతో సహా పర్యాటకాన్ని పెంచాలని చూస్తోంది. ఈ సెప్టెంబర్‌లో ఇలా వీసా రహిత కార్యక్రమాన్ని చైనీయుల కోసం అమలు చేసింది. ద్వీప దేశం శ్రీలంక కూడా పర్యాటకులను ఆకర్షించేందుకు ఏడు దేశాలను ఎంచుకుని పైలట్‌ ప్రాజెక్టుగా వీసా రహిత విధానాన్ని ప్రకటించింది. ఈ పైలట్‌ ప్రాజెక్టు మార్చి 31, 2024 వరకు అమలు చేసింది. ఏడు దేశాల ప్రజలు వీసా లేకుండా శ్రీలంకలో పర్యటించవచ్చు. ఆ ఏడు దేశాల్లో ఇండియా, చైనా, రష్యా కూడా ఉన్నాయి.

Also Read: Ashwini Vaishnaw: 150 దేశాల్లో యాపిల్ సలహా జారీ.. ప్రతిపక్షాల హ్యాకింగ్‌ ఆరోపణలపై స్పందించిన కేంద్రం

ఇదిలా ఉండగా కొవిడ్‌ అనంతరం థాయ్‌లాండ్‌ను పర్యటించిన వారిలో భారత్‌ నాలుగో స్థానంలో ఉంది. మలేసియా, చైనా, దక్షిణ కొరియా తర్వాత భారత్ ఉంది. భారత్‌ నుంచి 12 లక్షల మంది ఈ ఏడాది థాయ్‌లాండ్‌లో పర్యటించారు. భారత ప్రభుత్వ లెక్కల ప్రకారం.. విదేశాల్లో పర్యటించే వారి సంఖ్య 2011లో 1.4 కోట్లు ఉండగా.. 2019 వరకు 2.7 కోట్లు అంటే క్రమంగా పెరుగుతూ వస్తోంది.

Show comments