Paris Olympics 2024: క్వార్టర్ ఫైనల్‌కు భారత మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు..
- క్వార్టర్ ఫైనల్‌కు చేరిన భారత మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు
- రొమేనియాను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి ఎంట్రీ
- 16వ రౌండ్ లో రొమానియాను 3-2 తేడాతో ఓడించిన భారత జట్టు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పారిస్ ఒలింపిక్స్ లో భారత మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు రొమేనియాను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. 16వ రౌండ్ లో రొమానియాను 3-2 తేడాతో ఓడించింది. ఒలింపిక్స్ TTలో భారత్ ఉమెన్స్ జట్టు క్వార్టర్స్ చేరుకోవడం ఇదే తొలిసారి. ఈ ఈవెంట్లో శ్రీజ, అర్చన, మణిక బృందం అద్భుత ప్రదర్శన చేసి రొమేనియాను ఓడించారు. ఈ ఉత్కంఠ పోరులో ప్రపంచ 11వ ర్యాంకర్ టీమిండియా 3-2తో నాలుగో నంబర్ టీమ్ రొమేనియాపై విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్స్ లో భారత్ జట్టు అమెరికా లేదా జర్మనీతో పోటీ పడే అవకాశం ఉంది.
Bangladesh: షేక్ హసీనా రాజీనామాతో బంగ్లాదేశ్‌లో సంబరాలు.. వీధుల్లో నిరసనకారులు కేరింతలు
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ఈ మ్యాచ్‌లో శ్రీజ, అర్చన జోడీ తొలుత డబుల్స్‌లో అడుగుపెట్టింది. తొలి మ్యాచ్‌లో ఈ భారత జోడీ రొమేనియాకు చెందిన ఎడినా, సమారా జోడీని 3-0తో ఓడించి ముందంజ వేసింది. ఈ భారత జోడీ 11-9, 12-10, 11-7 తేడాతో ఎడినా, సమారాపై విజయం సాధించింది. ఆ తర్వాత.. మణిక తదుపరి మ్యాచ్‌లోకి ప్రవేశించింది. ఆ మ్యాచ్ లో బెర్నాడెట్‌ను 3-0తో సులభంగా ఓడించింది. మణికా 11-5, 11-7, 11-7 తేడాతో బెర్నాడెట్‌ను ఓడించింది. దీంతో భారత జట్టు రొమేనియాపై 2-0 ఆధిక్యంలో నిలిచింది.
Bangladeshi PM Reaches India: అగర్తలకు చేరుకున్న షేక్ హసీన.. నిర్ధారించిన త్రిపుర పోలీసులు
తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి 2-0తో ఆధిక్యంలో ఉన్న భారత జట్టు మూడో మ్యాచ్‌లో వెనుదిరిగింది. ఎలిజబెత్ సమారాతో జరిగిన ఉత్కంఠ సింగిల్స్ మ్యాచ్‌లో శ్రీజ ఆకుల ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో సమర 3-2తో శ్రీజను ఓడించింది. శ్రీజ, సమర మధ్య జరిగిన మ్యాచ్ లో 8-11, 11-4, 7-11, 11-6, 11-8 తేడాతో సమర గెలిచింది. ఈ మ్యాచ్‌లో శ్రీజ ఓడిపోయినప్పటికీ, రొమేనియాపై భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది. ఆ తర్వాత.. బెర్నాడెట్‌తో జరిగిన నాలుగో మ్యాచ్‌లో అర్చన కామత్ 3-1 తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో అర్చన 5-11, 11-8, 7-11, 9-11 తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. దీంతో.. భారత్, రొమేనియా మధ్య స్కోరు 2-2తో సమమైంది. కాగా.. చివరి మ్యాచ్‌లో మ్యాచ్ ఫలితం డిసైడ్ అయింది. ఈ మ్యాచ్‌లో మనిక 3-0 (11-5, 11-9, 11-9)తో ఎడినా డియాకానును ఓడించింది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!