Site icon NTV Telugu

UK: తాగుబోతు మహిళపై భారతీయ విద్యార్థి అత్యాచారం.. సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్

Girl Rape

Girl Rape

UK: బ్రిటన్ నుంచి షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ భారతీయ విద్యార్థి మద్యం మత్తులో ఉన్న మహిళను తన ఫ్లాట్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ ఘటన సీసీటీవీ ఫుటేజీలో రికార్డైంది. బీబీసీ కథనం ప్రకారం ఈ భారతీయ విద్యార్థి పేరు ప్రీత్ వికల్. అతని వయస్సు 20 సంవత్సరాలు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఈ షాకింగ్ సంఘటన కార్డిఫ్‌లో జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఓ మహిళను వికల్ తన చేతుల్లో ఎత్తుకుని ఎక్కడికో తీసుకెళ్తున్నట్లు వీడియో ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తోంది. భారతీయ విద్యార్థి తన నేరాన్ని అంగీకరించాడని నివేదికలో పేర్కొన్నారు. 20 ఏళ్ల వికల్ మహిళపై అత్యాచారం చేశాడని చెప్పాడు. ఈ కేసులో అతనికి ఆరేళ్ల తొమ్మిది నెలల జైలుశిక్ష పడింది.

Read Also:Jyeshtha Amavasya: జ్యేష్ఠ అమావాస్య నాడు ఈ స్తోత్రాలు వింటే సమస్త పాపాలు నశిస్తాయి

రాత్రిపూట తన స్నేహితులతో కలిసి బయటకు వెళ్లినప్పుడు ప్రీత్ వికల్‌ను కలిశానని బాధిత మహిళ తెలిపింది. గతేడాది జూన్‌లో జరిగిన ఈ ఘటనతో తనకు నిద్ర పట్టడం లేదని చెప్పింది. రాత్రి సమయంలో ఆమె తన స్నేహితుల నుండి విడిపోయి తన ఇంటికి వెళ్తున్నప్పుడు వికల్ తనను పట్టుకున్నాడని ఆమె చెప్పింది. అనంతరం ఆమెను నార్త్‌రోడ్‌లోని ఫ్లాట్‌లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. సీసీటీవీ ఫుటేజీని బట్టి ప్రీత్ వికల్‌ను గుర్తించి అరెస్ట్ చేశామని సౌత్ వేల్స్ పోలీసులు తెలిపారు. కార్డిఫ్‌లో ఇటువంటి దాడులు చాలా అసాధారణమైనవని వారు చెప్పారు.

Read Also:Odisha: ఆడుకుంటూ కారులోకి ఎక్కి ఊపిరాడక చనిపోయిన ఐదేళ్ల చిన్నారి

Exit mobile version