దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నాడు మరోసారి కుదేలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలకు తోడు దేశీయంగా అమ్మకాల ఒత్తిడిని తట్టుకోలేక సెన్సెక్స్ భారీ నష్టాలను చవి చూసింది. ఉదయం పూట నష్టాలతోనే మొదలైన మార్కెట్లు చివరి వరకు అదే ధోరణిని కొనసాగించాయి. దీంతో గురువారం నాటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 1158 పాయింట్లు దిగజారి 59,984 వద్ద స్థిరపడింది. అటు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ కూడా 353 పాయింట్లు నష్టపోయి 17,857 పాయింట్ల వద్ద ముగిసింది. ఈరోజు ట్రేడింగ్‌లో దాదాపు అన్ని రంగాల షేర్లు కుదేలయ్యాయి.
బీఎస్ఈలో ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఏషియన్ పెయింట్స్, మారుతి సుజుకి సంస్థల షేర్లు లాభపడగా… ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, టైటాన్ కంపెనీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లు నష్టపోయాయి. నేటి ట్రేడింగ్‌లో దాదాపుగా రూ.4.5 లక్షల కోట్ల సంపద ఆవిరైనట్లు తెలుస్తోంది. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.74.89 వద్ద కొనసాగుతోంది.
Read Also: ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో నాగార్జున భేటీ