Chandrayaan-3: చంద్రయాన్-3లో కీలక పరిణామం.. రాత్రి 7 గంటలకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrayaan-3: భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న చంద్రయాన్-3లో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. చంద్రయాన్-3 స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి కక్ష్యలోనికి ప్రవేశించనుంది. చంద్రయాన్-3 ఇప్పటికే జాబిల్లి దిశగా అత్యధిక దూరం పయనించింది. ఇవాళ రాత్రి 7 గంటలకు ఇది చంద్రుని కక్ష్యలో ప్రవేశించనుందని ఇస్రో ప్రకటించింది. స్పేస్ క్రాఫ్ట్ లోని విక్రమ్ ల్యాండర్‌కు అన్నీ అనుకూలిస్తే ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలంపై దిగతుందని ఇస్రో అంచనా వేస్తోంది. చంద్రుడిపై దిగే క్రమంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు విక్రమ్ ల్యాండర్ సొంతంగా నిర్ణయాలు తీసుకోగలదని చెప్పారు సైంటిస్టులు. చంద్రయాన్-2లోని విక్రమ్ ల్యాండర్ కు, చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్ కు ప్రధానమైన తేడా ఉందన్నారు. గతంలో ల్యాండింగ్ సమయంలో చంద్రుడి ఉపరితలాన్ని బలంగా ఢీకొట్టడంతో విక్రమ్ ల్యాండర్ లోని వ్యవస్థలు పనిచేయకుండా పోయాయి. ఈసారి అటువంటి పరిస్థితి రాకుండా, విక్రమ్ ల్యాండర్ ను మరింత అభివృద్ధి చేసినట్లు చెప్పారు సైంటిస్టులు.
Read Also: BlackMail: బ్లూ ఫిల్మ్ లో నటిస్తే పదిలక్షలు ఇస్తారన్న కీచకుడు.. వీడియో తీసి బ్లాక్ మెయిల్
Also Read
- Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
- Deputy CM Pawan Kalyan: మళ్లీ వాయిదాపడిన పవన్ కల్యాణ్ పోలవరం జిల్లా పర్యటన..
- TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
- Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఈ ఒక్క పని ప్రాణాలు కాపాడొచ్చు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా..
చంద్రయాన్-3ని జులై 14న LVM 3-M4 రాకెట్ ద్వారా విజయవంతంగా భూకక్ష్యలో ప్రవేశపెట్టారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఆతర్వాత రోజే దీని కక్ష్యను పెంచారు. ఇలా 18 రోజుల వ్యవధిలో దశలవారీగా అయిదుసార్లు కక్ష్యను పెంచారు సైంటిస్టులు. భూకక్ష్య పూర్తయినతర్వాత ఆగస్టు 1న ట్రాన్స్ లూనార్ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. దీంతో చంద్రయాన్-3 ప్రస్తుతం చంద్రుడి దిశగా వెళ్తుంది. ఇవాళ చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. చంద్రయాన్-3 ల్యాండర్ సురక్షితంగా చంద్రుడి ఉపరితలంపై దిగితే.. అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా రికార్డుకెక్కుతుంది భారత్. ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం ఇప్పటికే ఇస్రో 613 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఇక చంద్రయాన్-3 బరువు 3వేల 900 కిలోలు కాగా.. అందులో ల్యాండర్, రోవర్ బరువు 1752 కిలోలు. చంద్రునిపై వాతావరణం, ఖనిజ సంపద, అక్కడి పరిస్థితులను ల్యాండర్ క్షుణ్ణంగా పరిశీలించి సమాచారం ఇస్తుంది.
తాజావార్తలు
-
Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
-
Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
-
Tilak Varma: ఆ పొజిషన్లో బ్యాటింగ్ చేయడమే ఇష్టం.. కానీ తప్పడం లేదు!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
Deputy CM Pawan Kalyan: మళ్లీ వాయిదాపడిన పవన్ కల్యాణ్ పోలవరం జిల్లా పర్యటన..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!