Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
- 5 సంవత్సరాల లోపు పిల్లలకు..
- ప్రత్యేక సీటు లేదా బెర్త్ తీసుకోకపోతే ప్రత్యేక టికెట్ అవసరం లేదు..
- 5 ఏళ్లలోపు చిన్నారికి ప్రత్యేక బెర్త్ కావాలంటే టికెట్ తీసుకోవాలి.
- 5 నుంచి 12 సంవత్సరాల లోపు పిల్లలకు టికెట్ అవసరం
- ప్రత్యేక సీటు లేదా బెర్త్ తీసుకోకపోతే రాయితీ చార్జీతో టికెట్ బుక్ చేసుకోవచ్చు..
- రాయితీ చార్జీతో టికెట్ తీసుకుంటే ప్రత్యేక సీటు లేదా బెర్త్ కేటాయించబడదు...
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Railways Child Ticket Rules: రైలు ప్రయాణంలో టికెట్ విషయంలో ప్రయాణికులు, రైల్వే సిబ్బంది మధ్య వాగ్వాదాలకు సంబంధించిన వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ ప్రయాణికుడు తన చిన్నారి టికెట్ విషయంలో టికెట్ తనిఖీ చేసే సిబ్బందితో వాగ్వాదానికి దిగిన వీడియో చర్చనీయాంశంగా మారింది. పిల్లల వయసు, టికెట్ అవసరం వంటి అంశాలపై ఇద్దరి మధ్య మాటామాటా పెరిగినట్లు వీడియోలో కనిపిస్తోంది. అయితే రైలులో ప్రయాణించే సమయంలో పిల్లలకు టికెట్ తీసుకోవాలా లేదా..? అసలు రైల్వే రూల్స్ ఏంటో చూసేద్దామా..
5 ఏళ్లలోపు పిల్లలకు టికెట్?
రైల్వే నిబంధనల ప్రకారం.. 5 సంవత్సరాల లోపు పిల్లలకు ప్రత్యేక సీటు లేదా బెర్త్ తీసుకోకుండా తల్లిదండ్రులతో కలిసి ప్రయాణిస్తే ప్రత్యేక టికెట్ అవసరం ఉండదు. అలాంటి పిల్లలు తల్లిదండ్రులు లేదా వారితో ప్రయాణిస్తున్న వ్యక్తితోనే కూర్చోవాలి లేదా పడుకోవాలి. అయితే చిన్నారికి ప్రత్యేకంగా సీటు లేదా బెర్త్ కావాలంటే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల టికెట్ బుక్ చేసే సమయంలో పిల్లల వయసుతో పాటు ప్రత్యేక బెర్త్ అవసరమా లేదా అనే విషయాన్ని కూడా సరిగ్గా నమోదు చేయడం ముఖ్యం.
Also Read
- Sunil Gavaskar: ఇంకెంతకాలం ఆటగాళ్లను పిండేస్తారు? ఐసీసీకి గవాస్కర్ సూటి ప్రశ్న
- S. Jaishankar: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర అనిశ్చితి.. బ్రిక్స్ దేశాలకు జైశంకర్ కీలక సందేశం
- DILRMP 3.0: ఇకపై మీ భూమికి కూడా 'ఆధార్' లాంటి నెంబర్.. కేంద్రం సరికొత్త పథకం ప్రారంభం.!
- AP Government: వడ్డెర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. 16 జిల్లాల్లో 32 చోట్ల క్వారీ భూములు.. 50% రాయితీ
5 నుంచి 12 ఏళ్లలోపు పిల్లలకు?
5 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల లోపు పిల్లలకు టికెట్ అవసరం ఉంటుంది. ప్రత్యేక సీటు లేదా బెర్త్ తీసుకోకుండా రాయితీ చార్జీతో టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీనినే సాధారణంగా ‘హాఫ్ టికెట్’ అని పిలుస్తుంటారు. అయితే తక్కువ చార్జీతో టికెట్ తీసుకున్నంత మాత్రాన పిల్లలకు ప్రత్యేక సీటు లేదా బెర్త్ కేటాయించబడదు. వారు తల్లిదండ్రులు లేదా తమతో ప్రయాణిస్తున్న వ్యక్తి సీటులోనే కూర్చోవాలి లేదా పడుకోవాలి.
ప్రత్యేక బెర్త్ కావాలంటే..
5 నుంచి 12 సంవత్సరాల లోపు పిల్లలకు ప్రత్యేక సీటు లేదా బెర్త్ కావాలంటే సాధారణంగా పూర్తి ఛార్జీతో టికెట్ బుక్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి టికెట్ బుక్ చేసే సమయంలో పిల్లవాడికి ప్రత్యేక బెర్త్ అవసరమా లేదా అనే విషయాన్ని ముందుగానే నిర్ణయించుకోవాలి. ఇక 12 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న పిల్లలకు సాధారణంగా పెద్ద ప్రయాణికుల తరహాలో టికెట్ బుక్ చేయాలి. అందుకే రైల్వే టికెట్ రిజర్వేషన్ సమయంలో పిల్లల వయసును కచ్చితంగా నమోదు చేయడం చాలా ముఖ్యం.
పిల్లవాడు పాఠశాలలో ఏ తరగతిలో చదువుతున్నాడన్నది కాకుండా.. టికెట్ నిబంధనలకు అతని వయసే ప్రధాన ఆధారం. కాబట్టి కేవలం చిన్నగా కనిపిస్తున్నాడనే కారణంతో టికెట్ నిబంధనల్లో మినహాయింపు లభించదు. రైలులో పిల్లలతో ప్రయాణించే సమయంలో వారి వయసు, ప్రత్యేక సీటు లేదా బెర్త్ అవసరం వంటి వివరాలను ముందుగానే పరిశీలించి టికెట్ బుక్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ప్రయాణ సమయంలో టికెట్ తనిఖీల సందర్భంగా అనవసరమైన ఇబ్బందులు, వాగ్వాదాలను నివారించవచ్చు.
తాజావార్తలు
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav vs Ishan: క్రెడిట్ అంతా తీసుకున్నావ్.. వైభవ్ భవిష్యత్ కెప్టెన్.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Sunil Gavaskar: ఇంకెంతకాలం ఆటగాళ్లను పిండేస్తారు? ఐసీసీకి గవాస్కర్ సూటి ప్రశ్న
-
S. Jaishankar: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర అనిశ్చితి.. బ్రిక్స్ దేశాలకు జైశంకర్ కీలక సందేశం
-
CSK New Coach: సీఎస్కే కొత్త కోచ్.. ఎంఎస్ ధోనీ రెండు కీలక షరతులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!