Site icon NTV Telugu

Ind Pak War Effect: ఇండియా, పాకిస్తాన్ యుద్ధం ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.!

Sensex

Sensex

Ind Pak War Effect: ఇండియా – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఉదయం భారతీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం చేపట్టిన “ఆపరేషన్ సిందూర్” అనంతర పరిణామాలు మార్కెట్లపై ప్రభావం చూపించాయి. గత రాత్రి పాకిస్తాన్ నుండి భారత సైనిక స్థావరాలు, పట్టణాలపై పాకిస్థాన్ దాడులు జరిపే ప్రయత్నం చేసింది. అయితే ఆ మిసైళ్ళు, డ్రోన్లను భారత రక్షణ వ్యవస్థ సమర్ధంగా తిప్పికొట్టింది.

Read Also: Rajnath Singh: భారత్ – పాకిస్తాన్ ఉద్రిక్తతలపై హైఅలర్ట్.. త్రిదళాల చీఫ్‌లతో రక్షణ మంత్రి అత్యవసర భేటీ.!

ఈ నేపథ్యంలో నేడు ప్రీ-మార్కెట్ సమయంలో సెన్సెక్స్ 1,300 పాయింట్లకుపైగా పడిపోయింది. అయితే, ప్రారంభానికి సమయానికి నష్టాలను కొంత మేర తేరుకొని కేవలం 500 పాయింట్ల నష్టంతో మార్కెట్ ప్రారంభమైంది. నిఫ్టీ 24,000 కంటే దిగువకు పడిపోయినప్పటికీ, మళ్లీ తిరిగి పుంజుకుంది. దీనితో నిఫ్టీ 24,111 పాయింట్లను తాకింది. సెన్సెక్స్ 79,830 పాయింట్ల వద్ద కొనసాగుతుంది.

Read Also: Indian Army:భారత వైమానిక దళాల కౌంటర్ స్ట్రైక్.. పాక్ మిలిటరీ పోస్ట్‌లు ధ్వంసం.. వీడియో వైరల్

భారతదేశం చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక చర్యలు “ఆపరేషన్ సిందూర్” పేరుతో రెండు రోజుల క్రితం ప్రారంభమయ్యాయి. ఈ చర్యలలో పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్ర శిక్షణ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నారు. దీనికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ తీవ్రంగా స్పందిస్తూ దాడులకు దిగింది. అంతర్జాతీయంగా ఉగ్రవాద మద్దతుదారుగా పేరుగాంచిన పాకిస్తాన్ ఈ చర్యలను వ్యతిరేకించింది. ఈ పరిణామాల నేపథ్యంలో భద్రతా పరిస్థితులు కట్టుదిట్టంగా ఉన్నప్పటికీ, భారతీయ మార్కెట్లు స్థిరపడేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది.

Exit mobile version