NTV Telugu Site icon

Terrorism: భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు.. అమెరికా నుంచి ఆపరేటింగ్.. ఎఫ్‌బీఐకి కీలక సమాచారం

Us

Us

అమెరికాలోని సిలికాన్ వ్యాలీకి చెందిన ప్రముఖ భారతీయ- అమెరికన్ల బృందం న్యాయ శాఖతో పాటు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బిఐ), పోలీసులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో భారత్‌పై ఉగ్రవాద కార్యకలాపాలకు అమెరికా మట్టిని ఉపయోగిస్తోందని చెప్పారు. కాలిఫోర్నియాలో హిందువులపై పెరుగుతున్న ద్వేషపూరిత నేరాలపై న్యాయ శాఖ, ఎఫ్‌బీఐ, స్థానిక పోలీసుల సీనియర్ అధికారులతో ఈ బృందం సమావేశమైంది. ఈ మీటింగ్ లో పాల్గొన్న పలువురు వ్యక్తుల అమెరికాలోని చట్టపరమైన సంస్థలు భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతిచ్చే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. హిందూ, జైన దేవాలయాలపై విద్వేషపూరిత నేరాలు పెరిగిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Komatireddy Venkat Reddy: బీఆర్‌ఎస్‌ లో మిగిలేది ఆ నలుగురే.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు

కాగా, జస్టిస్ డిపార్ట్‌మెంట్ కమ్యూనిటీ రిలేషన్స్ సర్వీస్ నుంచి విన్సెంట్ ప్లేయర్, హర్‌ప్రీత్ సింగ్ మోఖా, అలాగే శాన్ ఫ్రాన్సిస్కో, మిల్పిటాస్, ఫ్రీమాంట్, నెవార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్లకు చెందిన FBI అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ భేటీ తర్వాత భారతీయ- అమెరికన్లు మాట్లాడుతూ.. తమపై విద్వేషపూరిత దాడులు పెరగడం వల్ల సమాజంలో చాలా భయాందోళన నెలకొంటుందన్నారు. భారతీయులకు చెందిన పాఠశాలలు, కిరాణా దుకాణాల వెలుపల ఖలిస్తాన్ అనుకూల వ్యక్తులు ట్రక్కులను నిలిపి భయపెడుతున్నారని ఆరోపించారు. అమెరికాలో ఖలిస్తాన్ ఉద్యమం గురించి తమకు సమాచారం లేదని సీనియర్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు చెప్పారని సమావేశంలో పాల్గొన్న కొందరు సభ్యులు పిటిఐకి తెలిపారు. వనరులు, నిధుల కొరత కారణంగా చర్యలు తీసుకోలేకపోయామన్నారు.

Read Also: Electoral Bonds Case: ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఒక్క రూపాయి కూడా దక్కని పార్టీ బీఎస్పీ

ఇక, ఈ సమావేశంలో హిందూ ప్రార్థనా స్థలాలను లక్ష్యంగా చేసుకుని ద్వేషపూరిత నేరాల పెరుగుదలను ఎదుర్కోవడానికి అందరు కలిసి వచ్చినందున భూటోరియా ధన్యవాదాలు తెలిపారు. గత నాలుగు నెలల్లో కేవలం బే ఏరియాలోనే 11 ఆలయాలపై దాడులు, ధ్వంసం, ద్వేషపూరిత విషయాలను రాసుకొచ్చారని ఆయన పేర్కొన్నారు. “మా సంఘంలో భయం ఉంది, కానీ మా సామూహిక సంకల్పం గతంలో కంటే బలంగా ఉంది అని వెల్లడించారు.