అమెరికాలోని సిలికాన్ వ్యాలీకి చెందిన ప్రముఖ భారతీయ- అమెరికన్ల బృందం న్యాయ శాఖతో పాటు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బిఐ), పోలీసులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో భారత్‌పై ఉగ్రవాద కార్యకలాపాలకు అమెరికా మట్టిని ఉపయోగిస్తోందని చెప్పారు. కాలిఫోర్నియాలో హిందువులపై పెరుగుతున్న ద్వేషపూరిత నేరాలపై న్యాయ శాఖ, ఎఫ్‌బీఐ, స్థానిక పోలీసుల సీనియర్ అధికారులతో ఈ బృందం సమావేశమైంది.