శనివారం ఉదయం భారత్‌లోని అనేక ప్రాంతాలలో పాకిస్థాన్ డ్రోన్ దాడులను నిర్వహించింది. జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో ఉన్న వైమానిక దళ స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నం చేసింది. అయితే.. భారత సైన్యం, రక్షణ వ్యవస్థ శత్రు డ్రోన్‌ను గాల్లోనే కూల్చివేశాయి. ఈ సమయంలో వైమానిక దళ స్టేషన్‌లో విధుల్లో ఉన్న ఒక సైనికుడు వీరమరణం పొందాడు. పాకిస్థాన్ డ్రోన్ ముక్కను ఢీకొట్టడంతో అమరుడయ్యారు.
READ MORE: Bangladesh: షాకింగ్.. షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్‌ను నిషేధించిన యూనస్ ప్రభుత్వం!
ఈ అమరవీరుడి పేరు సురేంద్ర సింగ్ మోగా. అతను రాజస్థాన్‌లోని ఝుంఝును నివాసి. ఉధంపూర్ వైమానిక దళ స్టేషన్‌లో విధుల్లో నిర్వహించారు. ఉదయం పాకిస్థాన్ డ్రోన్ దాడి చేసింది. భారత వాయు రక్షణ వ్యవస్థ డ్రోన్‌ను గాల్లోనే విజయవంతంగా ధ్వంసం చేసిందని అధికారులు తెలిపారు. కానీ శిథిలాల జవాన్ సురేంద్ర సింగ్‌ను ఢికొట్టాయి. అతను తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స పొందుతూ మరణించాడు. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ అమరవీరుడైన సైనికుడికి నివాళులర్పించి, ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు.
READ MORE: Cease Fire Violation : భారత్‌లోకి చొరబడేందుకు పాక్ యత్నం.. తిప్పికొట్టిన సైన్యం!
“రాజస్థాన్ కుమారుడు, ఝుంఝును నివాసి, భారత సైనికుడు సురేంద్ర సింగ్ మోగా ఉధంపూర్ వైమానిక దళం స్టేషన్‌లో జాతీయ భద్రతా విధిని నిర్వర్తిస్తూ.. అమరుడయ్యారు. ఈ వార్త చాలా విచారకరం. శ్రీరాముడు ఆ సద్గురువుకు పాదాల చెంత స్థానం కల్పించి, వారి బంధువులకు ఈ అపారమైన దుఃఖాన్ని భరించే శక్తిని ప్రసాదించుగాక.” అని ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా.. భారతదేశం, పాకిస్థాన్ కాల్పుల విరమణ ప్రకటించడానికి ముందే ఈ సంఘటన జరిగింది.
