ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. రాజ్‌కోట్‌లో ఇంగ్లాండ్ జట్టును 434 పరుగుల తేడాతో ఓడించింది. బ్యాటింగ్ లో యశస్వి జైస్వాల్ (214), సర్ఫరాజ్ ఖాన్ (68) పరుగులతో అదరగొడితే.. బౌలింగ్‌లో రవీంద్ర జడేజా స్పిన్ మాయజాలం చేశాడు. 557 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 122 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా 5 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీశారు. అశ్విన్, బుమ్రాకు తలో వికెట్ దక్కింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో లోయార్డర్ ఆటగాడు మార్క్ వుడ్(33) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో ఈ సిరీస్‌లో భారత జట్టు 2-1తో ముందంజలో ఉంది.
Viral Video: ఇనుప కడ్డీల మధ్య చిక్కుకుని విలవిలలాడుతున్న హంస.. వీడియో వైరల్
ఇదిలా ఉంటే.. టెస్టు చరిత్రలో పరుగుల తేడాతో భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం. ఇంతకుముందు 2021లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌ను 372 పరుగుల తేడాతో ఓడించింది. ఈ భారీ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో పాయింట్ల పట్టికలో టీమిండియాకు భారీ ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో విజయం సాధించిన భారత్.. ఏడు మ్యాచ్‌ల్లో 50 పాయింట్లు సాధించింది. భారత్ మార్కుల శాతం 59.52కి చేరుకుంది. 55 శాతం మార్కులు సాధించిన ఆస్ట్రేలియా జట్టును వెనక్కి నెట్టింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ రెండో స్థానానికి చేరుకుంది.
JP Nadda: బీజేపీ జాతీయాధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీకాలం పొడగింపు..
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో విజయం సాధించిన న్యూజిలాండ్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఆ జట్టు మార్కుల శాతం 75.00. ఇప్పటి వరకు నాలుగు టెస్టులు ఆడి మూడు మ్యాచ్‌లు గెలిచింది. 2023-25 సీజన్‌లో ఆస్ట్రేలియా 10 టెస్టులు ఆడి ఆరింటిలో విజయం సాధించింది. కంగారూలు మూడింటిలో ఓటమిని చవిచూశారు. ఒక మ్యాచ్ డ్రా అయింది. భారత్ ఏడు టెస్టులు ఆడగా నాలుగు విజయాలు సాధించింది. రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా ఓడిపోయింది. ఒక టెస్టు డ్రా అయింది.