Ind vs Ban 2nd Test: ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘనవిజయం సాధించింది. 2-0తో టెస్ట్ సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేసింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 145 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి భారత్ తీవ్రంగా కష్టపడింది. స్వల్ప వ్యవధిలో వికెట్లు కోల్పోతూ కష్టాల్లో పడింది. 45/4 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా వెంటనే వికెట్లను కోల్పోయింది. అనంతరం అయ్యర్(29), అశ్విన్(42) నిలకడగా ఆడుతూ భారత జట్టును విజయ తీరాలకు చేర్చారు. 7 వికెట్లు కోల్పోయి 145 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఛేదించింది. బంగ్లాదేశ్ బౌలర్లలో మిరాజ్ 5 వికెట్లు తీయగా.. షకీబ్ 2 వికెట్లు తీశాడు.
Stadium Collapsed : ఈజిప్టులో కూలిన స్టేడియం.. అభిమానుల మధ్య తొక్కిసలాట
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ : 227
టీమిండియా తొలి ఇన్నింగ్స్ 314
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ : 231
టీమిండియా రెండో ఇన్నింగ్స్ : 145/7