Smriti Mandhana: జస్ట్! 53 బంతుల్లోనే విజయం.. అయినా కెప్టెన్ స్మృతి మందాన అసంతృప్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smriti Mandhana: రాజధాని రాయ్‌పూర్‌లో జింబాబ్వేతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత మహిళల క్రికెట్ జట్టు కైవసం చేసుకుంది. ఈ విజయం పట్ల భారత కెప్టెన్ స్మృతి మందాన ఓవైపు హర్షం వ్యక్తం చేస్తూనే.. మరోవైపు అసంతృప్తి వ్యక్తం చేసింది. టీమిండియా కేవలం 53 బంతుల్లోనే 9 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించినప్పటికీ.. జట్టు ఫీల్డింగ్‌లో లోపాలు తలెత్తాయి. ముఖ్యంగా క్యాచ్‌లు చేజార్చడంపై కెప్టెన్ మండిపడింది. ఇక, ఓపెనర్ షెఫాలీ వర్మ మెరుపు బ్యాటింగ్, బౌలర్ల క్రమశిక్షణతో కూడిన ప్రదర్శనపై కెప్టెన్ ప్రశంసల జల్లు కురిపించింది.
ఇక, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 102 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో నికీ ప్రసాద్ వికెట్లు పడగొట్టగా.. క్రాంతి గౌడ్, నందని శర్మ, దీప్తి శర్మ, శ్రీ చరణి తలొక వికెట్ తీశారు. అనంతరం 103 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కేవలం 8.5 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించేసింది. ఓపెనర్ షెఫాలీ వర్మ కేవలం 25 బంతుల్లోనే 55 పరుగులు చేసి జట్టు విజయానికి గట్టి పునాది వేయగా, కెప్టెన్ స్మృతి మందాన 25 బంతుల్లో 47 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. వీరిద్దరూ తొలి వికెట్‌కు 96 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం విశేషం. ఈ విజయంతో భారత్ 2-0 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది.
Also Read
- Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
- Lal Hit Janata Party: దసరా నుంచే ‘‘CJP’’ పతనం.. ‘‘లాల్ హిట్ జనతా పార్టీ’’ ప్రారంభం..
- Aamir Khan: రాజ్ ఠాక్రే ఇంటికి అమీర్ ఖాన్.. మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కోసమేనా?
- AP Municipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం..
మ్యాచ్ ముగిసిన అనంతరం స్మృతి మందాన మాట్లాడుతూ.. తొలి మ్యాచ్‌తో పోలిస్తే ఈ మ్యాచ్‌లో బౌలర్లు వ్యూహాత్మకంగా బౌలింగ్ చేశారని మెచ్చుకుంది. అయితే, ఫీల్డింగ్ విషయంలో ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ముఖ్యంగా క్యాచ్‌లను వదిలేయడంపై దృష్టి పెట్టాలని, క్యాచ్‌లను సరిగ్గా అందుకోవాల్సి ఉందంటూ అసహనం వ్యక్తం చేసింది. ఇక షెఫాలీ ఆట తీరుపై స్పందిస్తూ.. ఆమె చాలా దూకుడుగా ఆడుతుండటంతో తాను సింగిల్స్ తీస్తూ ఆమెకే ఎక్కువ స్ట్రైక్ ఇచ్చానని చెప్పింది. మరోవైపు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకున్న షెఫాలీ వర్మ మాట్లాడుతూ.. తొలి టీ20లో తాను అవుటైన తీరు వల్ల రాత్రంతా సరిగ్గా నిద్రకూడా పట్టలేదని ఎమోషనల్ అయ్యింది. ఆ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని, ఈ మ్యాచ్‌లో బంతిని సరిగ్గా టైమింగ్ చేస్తూ సింగిల్స్ రొటేట్ చేయడంపై దృష్టి పెట్టానని వివరించింది.
తాజావార్తలు
-
Smriti Mandhana: జస్ట్! 53 బంతుల్లోనే విజయం.. అయినా కెప్టెన్ స్మృతి మందాన అసంతృప్తి..
-
Saddula Bathukamma : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!