NTV Telugu Site icon

Rajnath Singh: పాకిస్థాన్‌కు వెళ్లి మరీ ఉగ్రవాదుల్ని హత మారుస్తాం..

Rajnath Sngh

Rajnath Sngh

భారత దేశం ఉగ్రవాదాన్ని సహించబోదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. అవసరమైతే పాకిస్థాన్‌ భూభాగంలోకి చొరబడి మరీ ఉగ్రవాదుల్ని హత మారుస్తామని హెచ్చరించారు. బ్రిటన్‌ పత్రిక గార్డియన్‌ తాజాగా భారత్‌పై ఆరోపణలతో కూడిన ఓ న్యూస్ ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర రక్షణమంత్రి రియాక్ట్ అవుతూ.. పొరుగు దేశాలతో సత్సంబంధాలు కొనసాగించాలనే భారత్ ఎప్పుడూ కోరుకుంటుంది.. కానీ, ఉగ్రవాదుల చర్యలను ప్రతీసారి భారత్‌ ఊరుకోదు.. భారత్‌లోకి చొరబడి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడితే మాత్రం.. వాళ్ల భూభాగంలోకి వెళ్లి మరీ మట్టుపెడతాం అంటూ రాజ్నాథ్ సింగ్ వార్నింగ్ ఇచ్చారు.

Read Also: Rains in Telangana: తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు.. హైదరాబాద్‌కు సూచన లేదా..!

ఇదిలా ఉంటే.. పాకిస్తాన్‌లో వరుసగా ఉగ్రవాద నేతలు మరణిస్తున్నారు. అయితే, వాళ్లంతా అనుమానాస్పద రీతిలో.. మృతి చెందడం గమనార్హం. ఒక ప్లాన్‌ ప్రకారమే ఈ హత్యలు జరుగుతున్నాయంటూ ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దీనిపై బ్రిటన్ పత్రిక గార్డియన్ ఓ కథనం ప్రచురించింది.. విదేశాల్లోని ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌లో భాగంగా పాకిస్థాన్‌లో ముష్కరులను భారత ఇంటర్నేషనల్‌ నిఘా ఏజెన్సీ హత్యలు చేస్తుందని ఆరోపించింది. ఖలిస్థానీలను కూడా టార్గెట్‌గా చేసుకుందని పేర్కొనింది. మోడీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పాకిస్థాన్‌లో భారత వ్యతిరేకులుగా భావిస్తున్న వారిని చంపేసే కొత్త ధోరణి స్టార్ట్ అయింది అని తెలిపింది.

Read Also: IPL 2024: నేడు ఆర్సీబీ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ పోటీ.. ఈ సారైనా బెంగళూరు గెలిచేనా..?

ఇక, 2020 నుంచి 2023 వరకు దాదాపు 20 మంది ఈ విధంగా ప్రాణాలు కోల్పోయారు అని బ్రిటన్ పత్రిక గార్డియన్ తెలిపింది. ఈ హత్యలన్నీ భారత గూఢచార సంస్థ ‘రీసెర్చ్‌ అండ్‌ ఎనాలిసిస్‌ వింగ్‌’ (RAW) పర్యవేక్షణలో జరుగుతున్నాయని ఆరోపణలు చేసింది. ఈ మేరకు భారత్‌, పాకిస్థాన్‌ నిఘా, గూఢచార సంస్థల అధికారులతో మా (గార్డియన్‌) ప్రతినిధి మాట్లాడి వివరాలు సేకరించారు అని పెద్ద కథనం ప్రసారం చేసింది. అయితే, ఈ హత్యల్లో తమ ప్రమేయం లేదని, ఇది భారత వ్యతిరేక దుష్ప్రచారమని భారత విదేశాంగశాఖ తెలిపినట్లు కూడా ది గార్డియన్‌ వెల్లడించింది.