Suryakumar Yadav: మ్యాచ్ గెలిచినా కెప్టెన్ సూర్య అసంతృప్తి.. అక్కడే తేడా కొట్టిందని వారిపై సీరియస్!
Suryakumar Yadav: జింబాబ్వేపై భారత్ ఘన విజయం సాధించింది. 72 పరుగుల తేడాతో విజయ ఢంకా మోగించింది. దీంతో సెమీస్‌పై ఆశలు చిగురించాయి. చెన్నై వేదికగా జింబాబ్వేపై భారత్ సాధించిన 72 పరుగుల ఘన విజయం టీ20 వరల్డ్‌కప్ సూపర్ ఎయిట్స్‌లో జట్టుకు ఊపిరి పోసింది. దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన పరాజయం తర్వాత ఈ గెలుపు రెండు పాయింట్లతో పాటు, ఆత్మవిశ్వాసాన్ని సైతం తిరిగి తీసుకొచ్చింది. బ్యాటింగ్ విభాగం ఈ మ్యాచ్‌లో అసలైన రూపం చూపించింది. తొలి ఓవర్ నుంచే దూకుడు మొదలై, ఇన్నింగ్స్ అంతా కొనసాగింది. మొత్తం 17 సిక్సర్లు బాదుతూ టాప్ ఆరు బ్యాటర్లు తమ పాత్రను సమర్థంగా నిర్వర్తించారు. ఫలితంగా భారత్ 256/4 అనే భారీ స్కోరు నమోదు చేసింది. జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లో బ్రియాన్ బెన్నెట్ అజేయంగా 97 పరుగులు చేసి ఆకట్టుకున్నప్పటికీ, ఆ ఇన్నింగ్స్ మ్యాచ్ ఫలితాన్ని మార్చలేకపోయింది.
READ MORE: Pakistan: పాకిస్థాన్ సంచలన నిర్ణయం.. ఆఫ్ఘనిస్థాన్‌తో ‘ఓపెన్ వార్’ ప్రకటన.. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు!
Also Read
- Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..
- Pension Hike: పెన్షనర్లకు కేంద్రం శుభవార్త.. రూ. 7,500లకు పెరగనున్న కనీస పెన్షన్..?
- Bengal Elections: ఎన్నికల కౌంటింగ్ ముందు సుప్రీంకోర్టుకు తృణమూల్..
- PBKS Income: 2008 నుంచి ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కొట్టని పంజాబ్‌కు డబ్బులే డబ్బులు.. ఎలా అంటే..
అయితే మ్యాచ్ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మీడియాతో మాట్లాడుతూ.. లీగ్ దశలో ఏం జరిగిందో, అహ్మదాబాద్‌లో చివరి మ్యాచ్‌లో ఏం జరిగిందో మేము ఎక్కువగా ఆలోచించలేదు. గతాన్ని పూర్తిగా పక్కన పెట్టామన్నాడు. జట్టు వీడియో అనలిస్ట్ తయారు చేసిన స్లైడ్ ప్రజెంటేషన్‌ను బ్యాటర్లు, బౌలర్లు కలిసి చూసినట్లు వెల్లడించాడు. ఏడాది పొడవునా చేసిన మంచి ప్రదర్శనల్ని గుర్తుచేసుకుని, అక్కడి నుంచి పాజిటివిటీ తీసుకున్నామని వివరించాడు. టాప్ ఆర్డర్ నుంచి నంబర్ సెవెన్ వరకూ అందరూ సహకరించడం హృదయానికి ఆనందం ఇచ్చిందని సంతోషం వ్యక్తం చేశాడు. అయితే విజయం సాధించినప్పటికీ కెప్టెన్ ముఖంలో పూర్తిస్థాయి సంతృప్తి కనిపించలేదు. ప్రసారకర్త పొమ్మీ మ్బాంగ్వా ఈ అంశంపై ప్రశ్నించారు. సూర్యకుమార్ సమాధానం మరింత ఆసక్తికరంగా మారింది. “నిజం చెప్పాలంటే బౌలింగ్‌లో కొంచెం క్లినికల్‌గా ఉండాల్సింది. అయినా సరే, గెలుపు గెలుపే. ఇక ముందుకు సాగుతాం.. వెస్టిండీస్ మ్యాచ్‌లో ఇంక కొంచెం బెటర్‌గా ట్రై చేస్తాం.” అని మొదట చెప్పాడు. మ్బాంగ్వా మళ్లీ ప్రశ్నిస్తూ, “మీ నవ్వులో అసంతృప్తి కనిపిస్తోంది, మరింత వివరంగా చెప్పండి,” అని అడిగాడు. దానికి సూర్యకుమార్.. “జింబాబ్వే బ్యాటర్లకు క్రెడిట్ ఇవ్వాలి. వారు చాలా బాగా ఆడారు. పవర్‌ప్లేలో సమయం తీసుకుని, తర్వాత తెలివిగా ఇన్నింగ్స్ చే జిక్కించుకోవాలని ప్రయత్నించారు. కానీ బౌలింగ్ దృష్ట్యా కొన్ని సందర్భాల్లో మరింత తెలివిగా ఆప్షన్లు ఎంచుకోవాల్సింది,” అని స్పష్టం చేశాడు. ఈ వ్యాఖ్యలతో సూర్యకుమార్ బౌలింగ్‌పై నిరాశ వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది!
READ MORE: Virosh wedding : ఎట్టకేలకు ఒక్కటైన ‘విరోష్’.. నా భర్త విజయ్ దేవరకొండ అంటూ రష్మిక ఎమోషనల్ పోస్ట్!
తాజావార్తలు
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్‌గా చేసేయండి!
-
Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..
-
Property Law India: తల్లిదండ్రుల ఆస్తిపై పిల్లలకు హక్కు ఉందని అనుకుంటున్నారా? ఈ నిజం తెలిస్తే షాక్ అవుతారు!
-
Pawan Kalyan : ఇది కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులకు నిదర్శనం
-
Pension Hike: పెన్షనర్లకు కేంద్రం శుభవార్త.. రూ. 7,500లకు పెరగనున్న కనీస పెన్షన్..?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!