India vs WI: వెస్టిండీస్‌తో పోరుకు టీమిండియా ప్రకటన.. జట్టులోకి తిరిగొచ్చిన తెలుగోడు!
- వెస్టిండీస్ టెస్టులకు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా ఎంపిక
- జడేజా వైస్ కెప్టెన్.
- బీసీసీఐ ప్రకటించిన 15 మంది జట్టు
- రిషభ్ పంత్ గాయం కారణంగా దూరం.
- కరుణ్ నాయర్ పై వేటు
- నితీశ్ రెడ్డి రీఎంట్రీ, జగదీశన్‌కు వికెట్ కీపర్ ఛాన్స్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs WI: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వెస్టిండీస్‌తో స్వదేశంలో జరగనున్న టెస్టు సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. యువ బ్యాట్స్‌మెన్ శుబ్‌మన్ గిల్ జట్టుకు సారథ్యం వహించనుండగా.. సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఇకపోతే, ఇంగ్లండ్ పర్యటనలో ఆడిన జట్టుతో పోలిస్తే కొన్ని స్వల్ప మార్పులు చేశారు. గాయం నుంచి ఇంకా కోలుకోని కారణంగా.. వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. అలాగే, ఇంగ్లండ్ పర్యటనలో నిరాశపరిచిన కరుణ్ నాయర్‌పై వేటు పడింది. ఏడేళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన నాయర్, నాలుగు మ్యాచ్‌లలో కేవలం ఒకే ఒక్క అర్ధసెంచరీ చేయడంతో వేటు తప్పలేదు.
Zelenskyy: రష్యా తీరును ప్రపంచ దేశాలు ఖండించాలి.. యూఎన్‌లో జెలెన్స్కీ పిలుపు
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
వికెట్ కీపర్ కోటాలో పంత్ గైర్హాజరీతో ధ్రువ్ జురెల్ తో పాటు తమిళనాడు ఆటగాడు నారాయణ్ జగదీశన్‌కు కూడా చోటు దక్కింది. గాయం కారణంగా ఇంగ్లండ్ సిరీస్ మధ్యలో దూరమైన ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి విండీస్‌తో సిరీస్‌తో తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇక బౌలింగ్ విభాగం విషయానికి వస్తే.. పేస్ బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్‌తో కలిసి ప్రసిద్ కృష్ణ సేవలు అందించనున్నారు. స్పిన్ విభాగంలో స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన స్థానాన్ని నిలబెట్టుకోగా.. స్పిన్ ఆల్రౌండర్లుగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌తో పాటు వాషింగ్టన్ సుందర్ బరిలో దిగనున్నారు. ఈ టెస్టు సిరీస్ 2025-27లో భాగంగా అక్టోబర్ 2 నుంచి 14 వరకు జరుగుతుంది.
టీమిండియా జట్టు:
శుబ్‌మన్ గిల్ (C), రవీంద్ర జడేజా (V), యశస్వి జైస్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ (W), నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నారాయణ్ జగదీశన్ (W), కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.
🚨 Presenting #TeamIndia's squad for the West Indies Test series 🔽#INDvWI | @IDFCFIRSTBank pic.twitter.com/S4D5mDGJNN
— BCCI (@BCCI) September 25, 2025
తాజావార్తలు
-
Shubman Gill: “మా ప్లాన్ వర్కవుట్ అయింది”.. హైదరాబాద్‌పై భారీ విజయం తర్వాత గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Ramayana: ‘రామాయణ’లో..సాయి పల్లవిపై మేకర్స్ కీలక నిర్ణయం!
-
Daily Horoscope: బుధవారం రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని శుభవార్తలు!
-
Pat Cummins: “ఏం పర్వాలేదు.. ప్లేఆఫ్స్‌కు ఇంకా ఛాన్స్ ఉందిగా”.. కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్‌రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!