Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports India Vs West Indies 1st Odi Rohit Sharma Slams Netizens Over Virat Kohli Overseas Test Century

IND vs WI: ఇలాంటి విమర్శలు సరికాదు.. ప్రెస్ కాన్ఫెరెన్స్‌లో ఘాటుగా స్పందించిన రోహిత్ శర్మ!

Published Date :July 27, 2023 , 2:01 pm
By Sampath Kumar
IND vs WI: ఇలాంటి విమర్శలు సరికాదు.. ప్రెస్ కాన్ఫెరెన్స్‌లో ఘాటుగా స్పందించిన రోహిత్ శర్మ!
  • Follow Us :
  • google news
  • dailyhunt

India Captain Rohit Sharma on buzz around Virat Kohli Overseas Test Century: వెస్టిండీస్‌తో ఇటీవల జరిగిన రెండో టెస్టులో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. దాదాపుగా 5 ఏళ్ల తర్వాత విదేశీ గడ్డపై సెంచరీ బాదాడు. కోహ్లీ సెంచరీపై చాలా మంది ఫాన్స్, మాజీలు హర్షం వ్యక్తం చేయగా.. మరికొందరు మాత్రం విమర్శలు గుప్పించారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజీలాండ్ లాంటి పటిష్ట జట్లపై కాకుండా.. విండీస్‌ లాంటి జట్టుపై సెంచరీ చేశాడని వ్యాఖ్యానించారు. తాజాగా ఆ విమర్శలపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఘాటుగా స్పందించాడు. ఏ క్రికెటర్‌ ప్రదర్శన పైనా ఇలాంటి విమర్శలు చేయడం సరైంది కాదన్నాడు.

వెస్టిండీస్‌తో తొలి వన్డే మ్యాచ్ సందర్భంగా ప్రెస్ కాన్ఫెరెన్స్‌లో రోహిత్ శర్మ మాట్లాడుతూ… ‘ఇలాంటి విమర్శలపై ఇప్పటికే చాలాసార్లు స్పందించా. బయట నుంచి వచ్చే విమర్శలపై మేం ఎక్కువగా దృష్టి పెట్టం. జట్టులో ఏం జరుగుతుందనేది విమర్శలు చేసే వారికీ తెలియదు. అందుకే అలా మాటాడుతుంటారు. మా దృష్టంతా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించడంపైనే ఉంటుంది. వ్యక్తిగతంగా రాణించినా.. మ్యాచ్‌లో ఎలా గెలవాలనేదే మాకు ముఖ్యం. జట్టుకు ఆట ఎలా ఉపయోగపడ్డాదనేది కీలకం. ఇప్పుడు మూడు వన్డేల సిరీస్‌ను గెలవడం పైనే దృష్టి పెట్టాం. యువ క్రికెటర్లకు ఎక్కువ అవకాశాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం’ అని అన్నాడు.

Also Read: IND vs WI Dream11 Prediction: భారత్-వెస్టిండీస్‌ డ్రీమ్11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్!

‘జట్టులో చాలా మంది ఆటగాళ్లకు ఎక్కువ క్రికెట్‌ ఆడిన అనుభవం ఉంది. వారికి ప్రత్యేకంగా తమ పాత్ర, ఆట గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మ్యాచ్‌ పరిస్థితిని అర్థం చేసుకుని అందుకు తగ్గట్టుగా ఆడగలిగే సత్తా వారికి ఉంది. అయితే యువ క్రికెటర్లు స్వేచ్ఛగా ఆడగలిగేలా చూడటమే మా బాధ్యత. కొన్ని స్థానాల కోసం చాలా మంది ఆటగాళ్ల నుంచి తీవ్ర పోటీ నెలకొంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో చాలా ఆప్షన్లు ఉన్నాయి. ఈ సమయంలో తుది జట్టు ఎంపిక కెప్టెన్, కోచ్‌కు కష్టంగా ఉంటుంది’ అని రోహిత్ శర్మ చెప్పుకోచ్చాడు.

Also Read: Zaheer Khan-Virat Kohli: నా కెరీర్‌ను ముగించావ్ అని కోహ్లీతో అనలేదు: హీర్‌ ఖాన్‌

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ind vs wi
  • rohit sharma
  • VIRAT KOHLI
  • Virat Kohli Century
  • West Indies vs India 1st ODI

తాజావార్తలు

  • BJP: విధేయతకు పట్టం.. ఆఫీస్ ప్యూన్‌కు టికెట్ ఇచ్చిన బీజేపీ..

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Windfall Tax Hike: చమురు కంపెనీలకు షాక్.. డీజిల్‌పై సుంకం పెంచిన కేంద్రం

  • Sunrisers Hyderabad: మైల్‌స్టోన్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓటమి.. అదే కొంపముంచిందన్న ఇషాన్ కిషన్!

  • Fact Check: ‘జన నాయగన్’ సెన్సార్ నుంచి లీక్ అయిందా?

ట్రెండింగ్‌

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions